News March 17, 2025
నరసరావుపేట: 10వ తరగతి విద్యార్థులకు డీఈవో సూచనలు

సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరాలని డీఈవో చంద్రకళ సూచించారు. జిల్లాలోని 128 పరీక్ష కేంద్రాలలో 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ శాఖ 144 సెక్షన్ అమలు చేస్తుందన్నారు. అత్యవసర సమయాలలో విద్యార్థులు 100 ఫోన్ కు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News November 2, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 02, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.15 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.44 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 2, 2025
KMR: ‘తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు’

పల్వంచ మండలం ఫరీద్ పేట గ్రామానికి చెందిన మహిళా అత్యాచార ఘటన నిందితుడిని అరెస్ట్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ASP చైతన్య రెడ్డి, రురల్ CI రామన్లను ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అభినందించారు. శనివారం జిల్లాలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో ఆయన వారిని శాలువాతో సత్కరించారు. తప్పు చేసిన వారెవరు చట్టం పరిధిలో నుంచి తప్పించుకోలేరన్నారు. బాధితులకు పోలీసులే రక్షణగా మారాలన్నారు.
News November 2, 2025
ప్రైవేట్ ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

విజయనగరం జిల్లాలోని అన్ని ప్రైవేట్ దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం ఆదేశించారు. కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పండుగలు, జాతరల సమయంలో భద్రతా చర్యలు, బారికేడ్లు, క్యూలైన్ వ్యవస్థలు అమలు చేయాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.


