News October 9, 2025
నరసరావుపేట: ’22A’ భూములపై కలెక్టర్ సమీక్ష

పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా గురువారం కలెక్టర్ కార్యాలయంలో సెక్షన్ 22A కింద ఉన్న భూములపై సమీక్ష నిర్వహించారు. భూముల కేటాయింపు, హక్కుల గుర్తింపు, పత్రాల పరిశీలన, భూ వివాదాల పరిష్కారం వంటి అంశాలపై కలెక్టర్ చర్చించారు. భూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూ అధికారులు బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News October 9, 2025
విజయవాడ: ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా ప్రవీణ్ చంద్

ఏపీ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ బదిలీ అయ్యారు. తాజా బదిలీలలో ఏపీ ట్రాన్స్‌కోకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రవీణ్ చంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులిచ్చారు. కాగా 2019 బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్ చంద్ గతంలో విజయవాడ సబ్ కలెక్టరుగా పనిచేశారు.
News October 9, 2025
పల్నాడు: సచివాలయ ఉద్యోగినిపై అత్యాచార యత్నం: ఎస్ఐ

ఎడ్లపాడు (M)కారుచోల సచివాలయంలో పనిచేసే ఓ ఉద్యోగినిపై అదే గ్రామానికి చెందిన తిరుపతయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని PSలో కేసు నమోదైంది. SI శివరామకృష్ణ వివరాల మేరకు..తిరుపతయ్య తన దూడ ఆరోగ్యం బాగోలేదని చెప్పి, ఉద్యోగినిని తన ఇంటికి పిలిపించాడు. దూడను చూస్తున్న సమయంలో తిరుపతయ్య బలవంగా ఆమె చేయి పట్టుకుని లాగాడు. మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
News October 9, 2025
VMRDA కమిషనర్ కే.ఎస్.విశ్వనాథన్ బదిలీ

VMRDA కమిషనర్ కే.ఎస్.విశ్వనాథన్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్‌గా ఆయనను నియమించారు. VMRDA కమిషనర్‌గా విశ్వనాథన్ పలు సంస్కరణలను చేపట్టారు. VMRDA పరిధిలో ఉన్న టూరిజం, కళ్యాణమండపాలను అభివృద్ధి దిశగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించారు.