News December 17, 2025
నరసరావుపేట TDP పార్లమెంటరీ అధ్యక్షుడిగా కోమ్మాలపాటి.!

నరసరావుపేట పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కోమ్మాలపాటి శ్రీధర్ నియామకం దాదాపు పూర్తి అయింది. శ్రీధర్ 2024 నుంచి ఇప్పటి వరకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఆయన పని చేస్తున్నారు. టీడీపీ అధిష్ఠానం మల్లీ ఆయనవైపే మొగ్గు చూపిస్తోంది. 2009, 2014లో ఆయన రెండు సార్లు పెదకూరపాడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో అక్కడ భాష్యం ప్రవీణ్‌కు అవకాశం కల్పించారు.
Similar News
News December 17, 2025
50 శాతం మందికి వర్క్‌ఫ్రం హోం

ఢిల్లీలో <<18576427>>కాలుష్యం<<>> పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నింటిలో 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పరిస్థితి మెరుగుపడే వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.
News December 17, 2025
వరంగల్ జిల్లాలో పోలింగ్ శాతం ఇలా..!

జిల్లా వ్యాప్తంగా మూడో విడత సర్పంచి ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా నమోదైంది. నర్సంపేట మండలంలో 57.62 శాతం, ఖానాపురం మండలంలో 44.88 శాతం పోలింగ్ జరిగింది. చెన్నారావుపేట మండలంలో 64.86 శాతం, నెక్కొండ మండలంలో 63.3 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుండగా పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
News December 17, 2025
ములుగు: 11 గంటల వరకు 60.64% పోలింగ్ నమోదు

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదవుతోంది. ఉదయం 11 గంటల వరకు 60.64% ఓట్లు పోలయ్యాయి. కన్నాయిగూడెం మండలంలో 64.91%, వెంకటాపురం మండలంలో 60.10%, వాజేడు మండలంలో 59.35% పోలింగ్ నమోదయింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. కలెక్టర్, ఎన్నికల అబ్జర్వర్ పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


