News February 1, 2025
నరసాపురం: కాలువలో మృతదేహం
వేటాడేందుకు వెళ్లిన మత్స్యకారుడు కాలువలో పడి మృతి చెందిన ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు.. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామం ముస్కెపాలెంకు చెందిన కొపనాతి లక్ష్మణ్(57) శుక్రవారం వేటాడేందుకు కాలువలోకి వెళ్లాడు. ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల గాలించినా లక్ష్మణ్ జాడ తెలియలేదు. శనివారం వేములదీవి కాలువలో శవమై కనిపించాడు.
Similar News
News February 1, 2025
తణుకు ఎస్ఐ మృతదేహానికి నేడు అంత్యక్రియలు
తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న తణుకు రూరల్ ఎస్సై ఏ.జి.ఎస్ మూర్తి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. శుక్రవారం సాయంత్రం మృతదేహాన్ని ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా గంగవరం గ్రామానికి తరలించారు. శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
News February 1, 2025
ప.గో.జిల్లా.. విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష
పిల్లలు బడి బయట కాకుండా బడిలో ఉండి చదువుకునేందుకు అవకాశాలు మెరుగుపరిచేలా పాఠశాలలు పునర్వ్యవస్థీకరణ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. తణుకు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, అత్తిలి, ఇరగవరం మండలాల పరిధిలోని విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ శుక్రవారం తణుకులో సమీక్ష సమావేశం నిర్వహించారు. పిల్లలు విద్యావంతులైతేనే దేశం ప్రగతి వైపు పయనిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
News January 31, 2025
తణుకు: రాత్రంతా నిద్ర పోకుండా..!
తణుకు రూరల్ ఎస్ఐ ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఇవాళ పెనుగొండకు రానున్నారు. ఈ పర్యటనలో మూర్తి బందోబస్తు విధులు నిర్వహించాల్సి ఉంది. ఏదో విషయమై మదనపడుతూ నిన్న రాత్రంతా ఆయన నిద్రపోకుండా కుటుంబ సభ్యులతో గడిపారని తెలుస్తోంది. ఉదయాన్నే పెనుగొండకు వెళ్లాల్సిన ఎస్ఐ తణుకు స్టేషన్ దగ్గరకు వచ్చి తనతో తెచ్చుకున్న తుపాకీతో కాల్చుకున్నారు.