News February 23, 2025

నరసాపురం నుంచి బైకుపై కుంభమేళాకు..

image

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు నరసాపురం వాసులు బైకుపై వెళ్లొచ్చామన్నారు. పట్టణానికి చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు చామర్తి రవి కుమార్, నాగేంద్ర బైక్‌పై రోజుకు 500కిమీ చొప్పున 3 రోజులు ప్రయాణించి ప్రయాగ్రాజ్‌కు వెళ్లారు. పవిత్ర స్నానం తర్వాత 18న బయల్దేరి 21న నరసాపురం వచ్చారు. పెట్రోల్ బంకుల్లో టెంట్లలో బస చేస్తూ వెళ్లొచ్చినట్లు తెలిపారు.

Similar News

News April 20, 2025

పాలకొల్లు: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్

image

ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న పాలకొల్లుకు చెందిన ఎం.వెంకటరావు, ఏ.మురళీలను ఆదివారం పాలకొల్లు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరసాపురం డీఎస్పీ శ్రీవేద వివరాలను వెల్లడించారు. గత కొంతకాలంగా హైదరాబాద్, విశాఖ కేంద్రంగా ఇరువురు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. నిందితుల నుంచి 10 మొబైల్ ఫోన్లు, రూ.33,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.

News April 20, 2025

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

image

భీమవరంలోని గరగపర్రు రోడ్డులో శుక్రవారం రాత్రి ఇద్దరు బీటెక్ విద్యార్థులు బైక్‌పై వెళుతూ ఎదురుగా వస్తున్న బైకుని తప్పించిపోయి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాజమండ్రికి చెందిన జ్ఞాన సాగర్‌(21) తలకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఇజ్రాయెల్ శనివారం తెలిపారు. మరో విద్యార్థి సాయి భరత్ స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది.

News April 20, 2025

డీఎస్సీ: ఉమ్మడి ప.గో జిల్లాలో ఎన్ని పోస్టులంటే?

image

రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 16347 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాగా ఉమ్మడి ప.గోలో 1035 కొలువులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎస్ఏ తెలుగు 49, హిందీ 48, ఇంగ్లీష్ 85, మ్యాథ్స్ 45, ఫిజిక్స్ 42, జీవశాస్త్రం 59, సోషల్ 102, పీడీ 185, ఎస్జీటీ 417, ఎస్జీటీ ఉర్దూ 3 పోస్టులున్నాయి.

error: Content is protected !!