News February 26, 2025
నరసాపురం : మహిళ కడుపులో ఏడు కేజీల కణితి

నరసాపురం మండలం సారవ గ్రామానికి చెందిన మహిళ కడుపు నొప్పితో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేసి కడుపులో దాదాపు ఏడు కేజీల కణితి ఉందని నిర్ధారించారు. మంగళవారం మహిళకి ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న ఏడు కేజీల కణితిని తొలగించారు. ప్రస్తుతం పేషెంట్ ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని గైనకాలజిస్ట్ డా.అద్దంకి విజ్ఞాని తెలిపారు.
Similar News
News February 26, 2025
లింగంపాలెం: ప్రమాదంలో డ్రైవర్ మృతి

లింగంపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో ఉన్న ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ట్రాక్టర్ డ్రైవర్ రాత్రి సమయంలో ట్రాక్టర్ కింద నిద్రించాడు. పక్కనే ఉన్న లారీ డ్రైవర్ లారీ రివర్స్ చేసే క్రమంలో ట్రాక్టర్ ను ఢీకొనగా.. ట్రాక్టర్ ముందుకు జరిగింది. దీంతో ట్రాక్టర్ కింద పడుకున్న వ్యక్తి పై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 26, 2025
ప.గో జిల్లాలో ఉపాధ్యాయులకు సెలవు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ నేపథ్యంలో ఓటర్లకు, ఓటింగ్ రోజున స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను భారత ఎన్నికల కమిషన్ ప్రకటించిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తెలిపారు. అదేవిధంగా 27వ తేదీన పోలింగ్ నిర్వహించే కేంద్రాల వద్ద ఏర్పాట్ల నిమిత్తం స్థానిక సెలవుగా ప్రకటించినట్లు ఆమె అన్నారు. ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకునేవారు ఈ సెలవును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 26, 2025
పశ్చిమగోదావరిలో TODAY TOP HEADLINES

✷ ప.గో జిల్లా రెండు రోజులపాటు జిల్లాలో వైన్ షాపుల బంద్
✷ జిల్లాలో మొదలైన శివరాత్రి ఉత్సవాలు
✷ ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
✷ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సెలవు ప్రకటించిన కలెక్టర్
✷ మొగల్తూరులో చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష
✷ నర్సాపురం శివరాత్రి ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ