News March 29, 2025

నరసాపురం: ముద్దాయికి ఆరు నెలలు జైలు శిక్ష, జరిమానా

image

దొంగతనం కేసులో ముద్దాయికి జైలు శిక్ష, జరిమానా విధించినట్లు కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్సై భాస్కరరావు తెలిపారు. నరసాపురం పట్టణానికి చెందిన తిరుమాని చక్రధర్ (చక్రి) 2022 సంవత్సరంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తీ వద్ద నుంచి మొబైల్ చోరీ చేశాడన్నారు. అప్పటి ఎస్ఐ కె.సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేశారు. శుక్రవారం నేరం రుజువు కావడంతో ముద్దాయికి జడ్జి 6నెలలు జైలు శిక్ష, రూ.2వేలు ఫైన్ విధించారన్నారు.

Similar News

News February 21, 2026

భీమవరం: పంట కాలువలోకి దూసుకెళ్లిన బస్సు

image

భీమవరం మండలం యనమదుర్రులోని సూర్యమిత్ర ఫ్యాక్టరీ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. సదరు ఫ్యాక్టరీకి చెందిన బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సూర్యమిత్ర ఫ్యాక్టరీ బస్సుగా దీన్ని గుర్తించినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.

News February 21, 2026

ప.గో: శ్రీవారి ఫొటోలతో ప్లకార్డులు.. MLA నాయకర్ ఫైర్

image

శాసన మండలిలో YCP ఎమ్మెల్సీలు శ్రీవారి చిత్రపటాలను ప్లకార్డుల్లా వాడుతూ, చెప్పులేసుకుని వాటిని విసిరేయడంపై నరసాపురం MLA బొమ్మిడి నాయకర్ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో MLA బొలిశెట్టితో కలిసి ఆయన మాట్లాడారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన YCPకి ప్రజా క్షేత్రంలో ఉండే అర్హత లేదన్నారు. దేవుడి చిత్రపటాలను అవమానిస్తూ పాపానికి ఒడిగట్టారని మండిపడ్డారు.

News February 21, 2026

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు: ఆర్ఐవో ప్రభాకరరావు

image

ఈనెల 23 నుంచి ఇంటర్ పరీక్షలు పకడ్భందీగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్‌ విద్యా అధికారి (ఆర్‌ఎస్‌ఐవో) జి.ప్రభాకరరావు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళా శాలల నుంచి ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో 17,225, ద్వితీయ సంవత్సరం 16,925, ఒకేషనల్‌ విభాగంలో 1,919, 1772 మంది చొప్పున మొత్తం 37,841 విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.