News December 15, 2025

నరసాపురం వరకు వందేభారత్.. నేడే ప్రారంభం

image

AP: చెన్నై సెంట్రల్-విజయవాడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ నేటి నుంచి నరసాపురం వరకు నడవనుంది. ఇవాళ కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ నరసాపురం రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి చెన్నై వెళ్లే రైలును ప్రారంభిస్తారు. షెడ్యూల్.. చెన్నై నుంచి రైలు(20677) 5.30AMకు బయలుదేరి 11.45AMకు విజయవాడ వస్తుంది. గుడివాడ, భీమవరం మీదుగా 2.10PMకు నరసాపురం చేరుకుంటుంది. తిరిగి ట్రైన్(20678) 2.50PMకు బయలుదేరి 11.45PMకు చెన్నైకి వెళ్తుంది.

Similar News

News December 15, 2025

‘AGRATE’ ఏం చేస్తుంది?

image

‘AGRATE’ చిన్న రైతులకు నాణ్యమైన విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్, ఆధునిక వ్యవసాయ పరికరాలు, సేంద్రియ ఎరువులను తక్కువ ధరకే అందిస్తోంది. అలాగే కొమ్మలను అంటుకట్టడం, ఎక్కువ పంటల సాగు, స్థిరమైన వ్యవసాయ విధానాలపై రైతులకు ఆధునిక శిక్షణ ఇవ్వడంతో పంట దిగుబడి పెరిగింది. ITC, Godrej, Parle వంటి కంపెనీలతో శుక్లా ఒప్పందం చేసుకోవడంతో రైతుల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెరిగి వారి ఆదాయం గణనీయంగా పెరిగింది.

News December 15, 2025

ఈ నెల 19న శోభన్ బాబు ‘సోగ్గాడు’ రీరిలీజ్

image

టాలీవుడ్ సీనియర్ హీరో శోభన్ బాబు నటించిన ‘సోగ్గాడు’ చిత్రం ఈ నెల 19న రీరిలీజ్ కానుంది. చిత్రం విడుదలై 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అదే రోజున HYDలో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్‌కు ఈ మూవీ మంచి పేరు తీసుకొచ్చిందని నిర్మాత సురేశ్ బాబు తెలిపారు. నటుడిగానే కాకుండా వ్యక్తిగానూ శోభన్ బాబుకు ప్రత్యేక స్థానం ఉందని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు.

News December 15, 2025

కనకాంబరం సాగుకు అనువైన రకాలు

image

‘టిటియా ఎల్లో’ పసుపు రంగు పువ్వులు, ‘సెబకాలిస్ రెడ్’ ఎరుపు రంగు పువ్వులు, నారింజ రంగులో ‘లక్ష్మీ’ అధిక దిగుబడినిస్తాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే ‘డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం’ రకం అధిక నిల్వ స్వభావం కలిగి ఎక్కువ దూరం రవాణాకు అనుకూలమైంది. IIHR అభివృద్ధి చేసిన రకాలు అర్కా అంబరా(నారింజ ఎరుపు), అర్కా చెన్నా(నారింజ), అన్న కనక(నారింజ), అర్కా శ్రావ్య(నారింజ ఎరుపు) రకాలు ఎక్కువ దిగుబడినిస్తాయి.