News December 26, 2025

నరసాపురం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

నరసాపురం మండలంలోని సీతారామపురం సౌత్ గ్రామంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లలో భాగంగా మైక్ సెట్ కడుతూ జెట్టిపాలెం గ్రామానికి చెందిన శీలం అభిరామ్ (19) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించాడు. చెట్టుపై మైక్ అమర్చుతుండగా సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 17, 2026

పోలవరం తెలుగుదేశంలో అంతర్మథనం

image

పోలవరం టీడీపీలో అంతర్మథనం ప్రారంభం అయింది. ప్రస్తుతం బొరగం శ్రీనివాస్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నారు. కాగా ఇంఛార్జ్ మార్పు ఉంటుందంటూ ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, కొవ్వాసి జగదీశ్వరి పేర్లు ఇన్‌ఛార్జ్ రేసులో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో క్యాడర్ అయోమయంలో ఉంది. మరోవైపు గత ఎన్నికల్లో జనసేన టికెట్ దక్కించుకోవడంతో ఈ సారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని TDP నేతలు యత్నిస్తున్నారు.

News February 16, 2026

సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి: SP

image

భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో SP అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి నేరుగా 15 అర్జీలను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూవివాదాలు, ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను SP ఆదేశించారు.

News February 16, 2026

నరసాపురం: గల్ఫ్ వెళ్లిన మహిళ మృతి.. కానిస్టేబుల్‌‌పై కేసు

image

గల్ఫ్ పంపించి ఒక మహిళ మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులపై ఆదివారం నరసాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్టవరంకి చెందిన మురాల రాజమణి(48) డిసెంబర్ 4, 2025న గల్ఫ్‌లో మృతి చెందింది. రాజమణిని ఉండికి చెందిన భీమవరం ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అలుగు యేసేబు, బింకం విమలు గల్ఫ్ పంపారు. అక్కడ అనారోగ్యానికి గురైన తన తల్లికి వైద్య సదుపాయాలు కల్పించలేదని కుమార్తె ఉషా పోలీసులుకు ఫిర్యాదు చేసింది.