News February 19, 2025
నరసాపురం: వేధింపులు భరించలేక యువతి సూసైడ్

నరసాపురంలోని కొప్పర్రుకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఇన్‌ఛార్జ్ ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. పోలీసుల కథనం.. ఇంటర్ చదివి ఇంటి వద్దే ఉంటున్న యువతిని అదే ప్రాంతానికి చెందిన యు. సాలోమోను ప్రేమపేరిట అసభ్యంగా ప్రవర్తించాడు. అతనితో పాటు అతని భార్య,చెల్లి వచ్చి దుర్భాషలాడడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఇన్‌ఛార్జ్ ఎస్సై తెలిపారు.
Similar News
News December 17, 2025
సమస్యల పరిష్కారమే లక్ష్యం: రఘురామ కృష్ణంరాజు

ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారానికే ‘ప్రజా దర్బార్’ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. బుధవారం పెద అమిరంలోని తన కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించడమే ధ్యేయంగా అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని, అలసత్వం వహించకూడదని ఆయన సూచించారు.
News December 17, 2025
గోదావరి జిల్లాల్లో మొదలైన సంక్రాంతి సందడి..!

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. పందెం రాయుళ్లు కోడి పందేలకు సిద్ధం అవుతున్నారు. ఈసారి రూ.కోట్లలో పందేలు జరగడం ఖాయం అనే వాదన బలంగా వినిపిస్తుంది. ఎక్కడ ఎలా బరులు ఏర్పాటు చెయ్యాలి..? ఎవరు ఎవరితో సిండికేట్ అవ్వాలి..? వీఐపీలు, పందెం కాసే వారికి ఎలాంటి మర్యాదలు చెయ్యాలి..? పందేల నిర్వహణ ఎలా జరపాలనే అంశాలపై పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు పందెం రాయుళ్లు చర్చించుకుంటున్నారు.
News December 17, 2025
ఉండి: ఫలించిన ప్రియురాలు ధర్నా.. కథ సుఖాంతం

ఉండి మండలం మహాదేవపట్నం శివారు రామచంద్రపురానికి చెందిన భానుప్రకాష్ ఇంటి ముందు సోమవారం సాయంత్రం ప్రియురాలు దుర్గాభవాని కుటుంబ సమేతంగా సోమవారం ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి వ్యవహారం ఉండి పోలీస్ స్టేషన్‌కు చేరటంతో ఎట్టకేలకు ప్రియుడు దిగివచ్చాడు. పెళ్లి చేసికోవడానికి అంగీకరించాడు. పెద్దల సమక్షంలో పత్రాలు రాయడంతో కథ సుఖాంతమైంది.


