News March 11, 2025
నరసారావుపేట మాజీ MLAపై కంప్లైంట్

నరసారావుపేట మాజీ MLA గోపిరెడ్డి, మాజీ MP విజయసాయి రెడ్డిపై మాజీ కౌన్సిలర్ నాగజ్యోతి, టీడీపీ కార్యకర్తలు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాజీ స్పీకర్ కోడెల, అతని కుమారునిపై కేసులు పెట్టి వేధించారని పేర్కొన్నారు. అప్పట్లో శ్రీకాకుళం వాసి నాగరాజు తన వద్ద కోడెల రూ. 15 లక్షలు లంచం తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మాజీ MP, మాజీ MLA ఒత్తిడితోనే చేశానని ఒప్పుకున్నారు.
Similar News
News March 11, 2025
సీఎం చంద్రబాబుకు కొండా సురేఖ లేఖ

TG: తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో <<15712556>>తెలంగాణ<<>> ప్రజా ప్రతినిధుల సిఫారసులను పట్టించుకోవాలని AP CM చంద్రబాబుకు మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. ‘టీటీడీ అధికారులు తెలంగాణ భక్తులను అనుమతించకపోవడంతో గందరగోళం నెలకొంటుంది. వారి తీరుతో ప్రజాప్రతినిధులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలి. దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలి’ అని ఆమె చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.
News March 11, 2025
కర్నూలు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

➤కర్నూలు: ఇంటర్ పరీక్షల్లో ముగ్గురు డీబార్➤ ఆదోని మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి➤ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ➤ బీటీ నాయుడి ఆస్తులు రూ.5.68కోట్లు ➤ ఆలూరు: వైసీపీ ‘యువత పోరు’ అంటూ కొత్త డ్రామా➤ నటుడు పోసానికి ఆదోని కేసులో బెయిల్ మంజూరు➤ నందవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి➤ వైసీపీపై మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జి మండిపాటు ➤ పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ బస్సు సౌకర్యం
News March 11, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>మార్చి 15న పాడేరులో మెగా జాబ్ మేళా
>వైద్యశాఖలో పోస్టుల భర్తీకి ధరఖాస్తుల ఆహ్వానం
> నేటి ఇంటర్ పరీక్షలకు 654 మంది దూరం
>రంపచోడవరానికి చెందిన ముగ్గురి అరెస్టు
>రాజవొమ్మంగిలో గిరిజన రైతులకు ఉచితంగా ఎరువులు
>ఏజెన్సీలో గిరిజనేతరులకు గృహాలు మంజూరు చేయాలి..శిరీషదేవి
> డబ్బు తీయాలన్నా..డోలీ ఎక్కాల్సిందే!
>పాడేరులో 7 అంబులెన్సులు ప్రారంభం