News October 8, 2025

నరేంద్రపురం గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా మలేరియా అధికారి

image

పి గన్నవరం మండలంలోని నరేంద్రపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కోనసీమ జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్రావు బుధవారం సందర్శించారు. గురుకుల పాఠశాల, కళాశాలల వద్ద బాలుర వసతి గృహాల వద్ద దోమల వ్యాప్తి ఉండకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. పరిసరాల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలన్నారు.

Similar News

News October 8, 2025

HYD: గవర్నర్‌కు మల్లారెడ్డి ఆహ్వానం

image

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాజ్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఈనెల అక్టోబర్ 15వ తేదీన మైసమ్మ గూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గూగుల్ డిజిటల్ క్యాంపస్ 3.0 సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు.

News October 8, 2025

NZB: బ్యాంకర్లు లక్ష్యాలు పూర్తి చేయాలి

image

ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లా కార్యాలయంలో బుధవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం జరిగింది. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, ప్రగతి, వచ్చే సీజన్‌లో రైతాంగానికి అందిచాలన్నారు.

News October 8, 2025

ALERT: ప్రవేశాలకు రెండు రోజులే గడువు

image

TG: అంబేడ్కర్ ఓపెన్‌ యూనివర్సిటీలో 2025-26 విద్యాసంవత్సరానికి గాను అడ్మిషన్లకు దరఖాస్తు గడువు అక్టోబర్ 10తో ముగియనుంది. బీఏ, బీకాం, బీఎస్సీలో చేరేందుకు ఇంటర్మీడియట్ లేదా ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. ప్రవేశాల కోసం www.braouonline.inలో అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులకు రిటైల్ రంగంలో ఉపాధి కల్పించడానికి RASCI సంస్థతో యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది.