News February 3, 2025
నర్మల వాసికి జాతీయ నంది అవార్డు
గంభీరావుపేట మండలం నర్మల గ్రామానికి చెందిన ప్రముఖ కథ, నవల రచయిత గుండెల్లి నీలకంఠం జాతీయ నంది అవార్డు అందుకున్నారు. ఆదివారం విజయవాడలో తెలుగు వెలుగు సాహితీ వేదిక కాళోజీ తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు అవార్డును ప్రదానం చేశారు. తెలుగు సాహిత్యంలో విశేషమైన సేవలు చేశారని ఆయనను అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News February 3, 2025
గుంటూరు: శీలంవారి వీధిలో సప్లయర్ ఆత్మహత్య
కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శీలంవారి వీధిలో ఇనుప దులానికి చీరతో ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొన్నూరు రోడ్డులోని ఓ హోటల్లో సప్లయర్‌గా పనిచేస్తున్న శ్రీను(50)రెండేళ్లుగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహానికి సంబంధించిన రక్త సంబంధీకుల వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని గుంటూరు కోవిడ్ ఫైటర్స్ సహాయంతో జీజీహెచ్ మార్చూరీకి తరలించామని సీఐ వీరయ్య తెలిపారు.
News February 3, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు
∆} నేలకొండపల్లిలో భక్త రామదాసు జయంతి వేడుకలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
News February 3, 2025
కచిడి చేప@3.95 లక్షలు
AP: కాకినాడ వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను అదృష్టం వరించింది. అరుదైన కచిడి చేప వారికి కాసులు కురిపించింది. 25KGల చేప వేలంలో రూ.3.95 లక్షలు పలికింది. దీని శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్. కుట్లు వేసేందుకు వాడే దారాన్ని ఈ చేప పొట్ట భాగం నుంచే తయారు చేస్తారు. సౌందర్య సాధనాల తయారీలో వినియోగిస్తారు. ఖరీదైన వైన్లను శుభ్రం చేయడానికి ఈ చేప రెక్కలను వాడతారు. అందుకే ఈ ఫిష్‌కు డిమాండ్.