News March 19, 2026

నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాట్ల పరిశీలన

image

నర్మెట వద్ద నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్ ప్రారంభించనున్న నేపథ్యంలో కలెక్టర్ కే. హైమావతి బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. నేటి నుంచి మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం కానున్న నాలుగు రోజుల ‘రైతు మహోత్సవం’ వేదికను ఆమె సందర్శించారు. అధికారులతో కలిసి ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.. హెలిప్యాడ్ నిర్మాణం, బహిరంగ సభ స్థలం, స్టాళ్ల ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు.

Similar News

News April 3, 2026

మేడ్చల్: వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండాలి: కలెక్టర్

image

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. కూకట్‌పల్లిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని DMHO ఉమాగౌరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు అంకితభావంతో పని చేయాలన్నారు. రోగుల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని, కాలం చెల్లిన మందులపై జాగ్రత్త వహించాలని ఆదేశించారు.

News April 3, 2026

పేర్ని నానిపై పెట్టిన సెక్షన్లు ఇవే..!

image

మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. మచిలీపట్నం కొబ్బరితోటలో ఓ అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో పేర్ని నాని పరామర్శ పేరుతో అక్కడకు వచ్చి మీడియా ముందు పోలీసులను బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలపై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను బహిరంగంగా బెదిరించడంతోపాటు ఇనగుదురు సీఐ బాడీని షేమింగ్ చేస్తూ పేర్ని మాట్లాడారు. దీనిపై పోలీసులు ఆయనపై BNS 196, 353(2), 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

News April 3, 2026

మరో వివాదంలో IAS రోహిణి సింధూరి!

image

IPS రూపాపై <<10034506>>ఆరోపణలతో<<>> వార్తల్లో నిలిచిన IAS రోహిణి సింధూరి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై FIR నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. 2021లో మైసూర్ డిప్యూటీ కమిషనర్‌గా ఉండగా ₹13 కాటన్ బ్యాగులను ₹52కు కొనడంతో ₹7.65 కోట్ల నష్టం వచ్చిందనే ఆరోపణలున్నాయి. ఆమెపై కేసు పెట్టాలని రవిచంద్రే గౌడ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆయన HCని ఆశ్రయించారు.