News June 23, 2024
నర్రవాడ: విద్యుత్ దీపాలంకరణలో వెంగమాంబ దేవస్థానం
మండలంలోని నర్రవాడ వెంగమాంబ పేరంటాలు దేవస్థానం విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా ఉంది. అంతేకాక పరిసర ప్రాంతాలలో పలు దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అష్టలక్ష్మి దేవతలు, వినాయక స్వామి, దుర్గామాత, వెంగమాంబ ఇతర దేవత మూర్తుల విద్యుత్ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివారం నుండి బ్రహ్మోత్సవాలు నిలుపుకార్యక్రమంతో ప్రారంభం కానున్నాయి.
Similar News
News January 19, 2025
ఇవాళ సూళ్లూరుపేటకు రానున్న ప్రముఖులు వీరే
సూళ్లూరుపేటలో ఆదివారం ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు నేడు సూళ్లూరుపేటకు రానున్నారు. వారిలో నటి, యాంకర్ అనసూయ, అషు రెడ్డి, యాంకర్ రేణు, సింగర్ గాయత్రి, రఘురామ్, కొరియోగ్రాఫర్ సత్య, చైల్డ్ సింగర్ సాయి వాగ్ దేవి, మిమిక్రీ ఆర్టిస్ట్ షరీఫ్ తదితరులు ఉన్నారు.
News January 19, 2025
HYD ఓయో రూమ్‌లలో ఉంటూ గంజాయి వ్యాపారం
హైదరాబాదు ధూల్‌పేట జాలీ హనుమాన్ దేవాలయం వద్ద ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు. వారు మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌కి చెందిన సంజన మాంజా(18), నెల్లూరు జిల్లా కావలికి చెందిన రాజు(25) ఓయో రూమ్‌లలో అద్దెకు ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నారని వారు తెలిపారు. పక్కా సమాచారంతో దాడి చేసి వారిని పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 3.625 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
News January 19, 2025
నెల్లూరు: పెరుగుతున్న నిమ్మ ధరలు.. రైతుల్లో ఆనందం
రెండు రోజుల నుంచి నిమ్మ ధరలు ఊపందుకున్నాయి. ఇటీవల చలి ప్రభావం ఎక్కువ ఉండడంతో ధరలు ఆశించినంతగా లేక రైతులు ఆందోళన చెందారు. గూడూరు మార్కెట్లో కిలో నిమ్మకాయలు రూ. 25 నుంచి రూ. 35 వరకు పలుకుతున్నాయి. నాణ్యత కలిగిన నిమ్మకాయలు రూ. 45 పలుకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. 50 కేజీల లూజు బస్తా రూ. 2,400 నుంచి 3,300 వరకు అమ్ముతున్నారు. నిమ్మ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.