News March 31, 2025
నర్వలో పేకాట రాయులు అరెస్ట్

నర్వ గ్రామ శివారులో పేకాడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ, కుర్మయ్య తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం గ్రామ శివారులో బోయపాటి నర్సింహులు పొలం దగ్గర రహస్యంగా పేకాడుతున్న ఆరుగురిని పట్టుకొని వారి దగ్గరి నుంచి రూ.1,080, నాలుగు సెల్‌ఫోన్‌లు, నాలుగు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News April 2, 2025
HCU.. కంచె భూముల అభివృద్ధి ఎందుకంటే?

HCUని అంటిపెట్టుకొని ఉన్న 400 ఎకరాల కంచె భూములతో యూనివర్సిటీకి సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ భూములను అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భారీగా పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అవకాశం ఉందని చెబుతోంది. అయితే ఈ ప్రాంతం వర్సిటీకి చెందినదని, అభివృద్ధి పేరుతో జీవ వైవిధ్యం దెబ్బతీస్తున్నారని విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు వాదిస్తున్నారు.
News April 2, 2025
ప్రకృతి vs అభివృద్ధి.. మీరు ఎటువైపు?

HYD గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించడం వివాదాస్పదం అవుతోంది. వేలాది చెట్లతో నగరానికి ఆక్సిజన్ అందిస్తోన్న ప్రాంతాన్ని అర్బనైజేషన్ చేయడం ఎందుకని ప్రకృతి ప్రేమికులు, HCU స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి నేపథ్యంలో పర్యావరణానికి కొంతమేర నష్టం కలగక తప్పదని.. ఇప్పటి హైటెక్ సిటీ కూడా అలానే వచ్చిందని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News April 2, 2025
KPHB: భర్త టార్చర్ భరించలేక భార్య సూసైడ్!

కట్టుకున్న భర్తే వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHB పీఎస్ పరిధిలోనీ 3వ ఫేజ్‌లో చోటుచేసుకుంది. రజనీకాంత్ రెడ్డి, సౌజన్యకు(29) 2020లో వివాహమైంది. వీరికి మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. తన భర్త, అత్త, మరిది శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో 3 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.