News October 18, 2025
నర్వ: నీటి సంపులో పడి చిన్నారి మృతి

నర్వ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి 18 నెలల చిన్నారి నీటి సంపులో పడి మృతి చెందింది. స్థానికుల వివరాలు.. శివరాం, పావనిల కూతురు రాజేశ్వరి (18 నెలలు)ని నానమ్మ పక్కన కూర్చోబెట్టి గడ్డి తొలగిస్తుండగా, ఇంటి పక్కన ఉన్న సంపులో రాజేశ్వరి పడింది. కొద్దిసేపటికి చిన్నారి కనిపించకపోవటంతో వెతికారు. సుమారు గంట తర్వాత సంపులో చిన్నారి మృతిచెంది కనిపించటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Similar News
News October 18, 2025
తెలంగాణ బంద్.. ఇది ఎవరిపై పోరాటం?

TG: రాష్ట్ర బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతోంది? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. 42% శాతం రిజర్వేషన్ల కోసం BC సంఘాలు బంద్ చేపట్టాయి. దానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్, కేంద్ర అధికార పార్టీ BJP కూడా మద్దతు తెలిపాయి. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే మరి బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వానికా? రాష్ట్ర ప్రభుత్వానికా? అసలు పోరాటం ఎవరిపై?
News October 18, 2025
దోమకొండ టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్

దోమకొండకు చెందిన దేవరగట్టు బాలప్రసాద్ 17 ఏళ్ల కృషికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కింది. తన ఆలోచనలను, సాంకేతికతను, మానవత్వాన్ని జోడించి నాయకుడిగా ఉద్యోగులను చేర్చాడు. ఖచ్చితమైన విశ్వాసంతో జనరేటివ్ AI హ్యాకథాన్ మార్పుతో కోడర్‌గా, సృష్టికర్తగా స్వీకరించి, యాప్‌గా కాకుండా మిషన్‌గా భావించాడు. జీవితంలో ప్రేరణ అనేది చాలా ముఖ్యమని ఆయన అన్నారు.
News October 18, 2025
ఆత్మహత్యకు కారకులైన నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష

భూవివాదంలో వ్యక్తిని బెదిరించి ఆత్మహత్యకు కారణమైన 8మంది నిందితులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కిరణ్ కుమార్ శుక్రవారం తీర్పు చెప్పారు. అశ్వాపురం(M) మొండికుంటకు చెందిన గూడూరు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు సీఐ రాజు కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.