News October 3, 2025
నర్సంపేట ఘటనపై విచారణ కొనసాగుతోంది: వరంగల్ సీపీ

నర్సంపేటలో గాంధీ జయంతి వేళ CI సమక్షంలో జంతు బలి ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. గురువారం సాయంత్రం నర్సంపేట వెంకటేశ్వరస్వామి గుడి వద్ద ఈ కార్యక్రమం జరిగింది. పోలీసులు బందోబస్తు కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Similar News
News October 3, 2025
పాడేరు: మీకోసం కార్యక్రమానికి 67 ఫిర్యాదులు

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 67 ఫిర్యాదులు అందాయి. జేసీ అభిషేక్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్‌తో కలిసి కలెక్టర్ దినేశ్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News October 3, 2025
భయభ్రాంతులకు గురికావద్దు: తిరుపతి SP

అపోహలు, ఊహాగానాలను నమ్మవద్దని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు శుక్రవారం తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో బాంబులు పెట్టినట్లు కొన్ని ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులు అందుతున్నాయని అన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ మెయిల్స్ సమాచారంపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి భయభ్రాంతులకు గురికావద్దన్నారు.
News October 3, 2025
విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదు: మద్రాస్ HC

తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. టీవీకే చీఫ్ విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఘటన తర్వాత ఆ పార్టీ నేతలంతా ఎక్కడికి వెళ్లారని, బాధితులను ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. ఘటనపై సిట్ దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. టీవీకే నేతల ముందస్తు బెయిల్ తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.