News October 3, 2025

నర్సంపేట ఘటనపై విచారణ కొనసాగుతోంది: సీపీ

image

నర్సంపేట పట్టణ కేంద్రంలో గాంధీ జయంతి వేళ సీఐ సమక్షంలో జంతు బలి ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు. గురువారం సాయంత్రం వెంకటేశ్వరస్వామి గుడి దగ్గర ఈ కార్యక్రమం జరుగగా పోలీసులు బందోబస్తు కోసం వెళ్లిన సమయంలో జంతు బలి జరిగింది.

Similar News

News October 3, 2025

VZM: ‘ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం’

image

భారీ వర్షాల పట్ల అప్రమతంగా ఉండాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డిని ఆదేశించారు. శుక్రవారం వర్షం నష్టంపై జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నామని, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. జిల్లాలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

News October 3, 2025

అనుమతి లేని వాయిస్ వినియోగంపై బాంబే హైకోర్టు కీలక తీర్పు

image

AIతో ముఖాలను, స్వరాలను తారుమారు చేసి వినియోగించడం ఇటీవల సాధారణమైంది. అయితే అనుమతి లేకుండా ప్రముఖుల స్వరాన్ని, పేర్లను, చిత్రాలను వినియోగించడం వారి హక్కును ఉల్లంఘించడమేనని బాంబే హైకోర్టు పేర్కొంది. ప్రముఖ సింగర్ ఆశా భోస్లే పిటిషన్‌పై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇవి కొన్నిసార్లు మ్యానిప్లేషన్‌కు దారితీస్తాయంది. అనుమతి లేని వాటిని వెంటనే తొలగించాలని యూట్యూబ్, అమెజాన్, ఫ్లిప్‌కార్టులను ఆదేశించింది.

News October 3, 2025

కొవ్వూరు: ‘గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి’

image

కొవ్వూరు మండలంలో గృహ నిర్మాణాల పురోగతిపై జిల్లా గృహ నిర్మాణాధికారి బుజ్జి శుక్రవారం సమీక్షించారు. గృహ నిర్మాణ శాఖ ఆఫీస్‌లో నియోజకవర్గంలోని హౌసింగ్ అధికారులతో నిర్మాణాలను దశలవారీగా చర్చించారు. త్వరలో సీఎం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లను సామూహిక గృహప్రవేశాలు చేయనందున నిర్మాణ పనులు వేగ వంతం చేయాలని ఆదేశించారు. ఈఈ సీహెచ్ వేణుగోపాలస్వామి, డీఈఈ శేఖర్ బాబు, ఏఈలు పాల్గొన్నారు.