News December 27, 2025

నర్సంపేట: పొలాల్లో మొసలి కలకలం!

image

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముగ్ధుంపురం గ్రామంలో మొసలి పిల్ల కలకలం రేపింది. ఓ రైతు పొలంలో శుక్రవారం సాయంత్రం మొసలి పిల్ల కనిపించింది. స్థానికులు భయంతో వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సిబ్బంది మొసలిని పట్టుకొని ఖానాపురం మండలం పాకాల సరస్సులో వదిలినట్లు తెలిపారు. సమీపంలో వాగు నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.

Similar News

News December 28, 2025

WGL: ఇన్నర్ రింగ్ రోడ్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

వరంగల్ నగర అభివృద్ధిలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు పూర్తితో నగర అభివృద్ధికి బలమైన బాటలు పడతాయని, ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 28, 2025

సిరిసిల్ల ‘108’ సిబ్బందికి అత్యవసర వైద్య సేవలపై శిక్షణ

image

కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అంబులెన్స్ పైలట్లు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు (ఈఎంటీ) ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఈ సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ది శ్రీనివాస్, లక్ష్మణ్, సాగర్, అనీల్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

News December 28, 2025

జగిత్యాల: ‘కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగు చెందారు’

image

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగు చెందారని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. సారంగాపూర్ (M) లక్ష్మీదేవిపల్లె మాజీ సర్పంచ్ లక్ష్మి తమ అనుచరులు 50 మంది, ధర్మానాయక్ తండా నుంచి చందు నాయక్‌తో పాటు 10 మంది కాంగ్రెస్ నాయకులు శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.