News March 25, 2025
నర్సంపేట: యాక్సిడెంట్.. బీటెక్ విద్యార్థి మృతి

వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. జయముఖి కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న దారం వికాస్(22), మరో విద్యార్థి రాజు బైక్‌పై పాకాల నుంచి నర్సంపేటకు వస్తున్నారు. రాజుపేట శివారులో ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈ ఘటనలో వికాస్ అక్కడికక్కడే మృతి చెందగా.. రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. జనగామ జిల్లా చిల్పూర్ వికాస్ స్వస్థలం.
Similar News
News December 26, 2025
‘రుషికొండ’ను TTDకి అప్పగించాలి: BJP MLA

AP: విశాఖపట్నం రుషికొండ భవనాలను, కింద ఉన్న మరికొంత భూమిని ప్రముఖ హోటళ్లకు కేటాయించేలా ఇటీవల మంత్రుల కమిటీ చర్చించడం తెలిసిందే. ఈనెల 28న తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా BJP MLA విష్ణు కుమార్ రాజు దీనిపై స్పందిస్తూ స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ‘రుషికొండను ఆదాయవనరుగా చూడొద్దు. హోటళ్లకు ఇస్తే సామాన్యులకు దూరం అవుతుంది. TTDకి అప్పగించి ఆధ్యాత్మిక సిటీగా మార్చాలి’ అని కోరారు.
News December 26, 2025
KMR: రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం

కామారెడ్డిలోని పంచముఖి హనుమాన్ కాలనీ రైల్వే ట్రాక్ సమీపంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా? లేదా ఆత్మహత్యనా? అన్న కోణంలో విచారిస్తున్నట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు.
News December 26, 2025
ఛాంపియన్, శంబాల కలెక్షన్లు ఇవే?

నిన్న విడుదలైన ఛాంపియన్, శంబాల, దండోరా, ఈషా సినిమాలు పాజిటివ్ టాక్స్ తెచ్చుకున్నాయి. శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించిన ‘ఛాంపియన్’కు తొలిరోజు రూ.4.50 కోట్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది. ఆది సాయికుమార్ నటించిన శంబాల మూవీకి రూ.3.3 కోట్లు వచ్చినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. హారర్ చిత్రం ఈషాకు రూ.1.6 కోట్లు వచ్చినట్లు టాక్. దండోరా కలెక్షన్లపై వివరాలు తెలియాల్సి ఉంది.


