News February 1, 2025
నర్సంపేట: సెమిస్టర్ ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించినట్లు స్థానిక నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మల్లం నవీన్, కోఆర్డినేటర్ డాక్టర్ వి పూర్ణచందర్ శనివారం తెలిపారు. 1, 3, 5 సెమిస్టర్ల పరీక్ష ఫీజు ఫిబ్రవరి 4 పొడిగించామన్నారు. ఐదో సెమిస్టర్ పరీక్షలు మార్చి 1 నుంచి 6 వరకు, మూడో సెమిస్టర్ పరీక్షలు 7 నుంచి 13 వరకు ఉంటాయన్నారు.
Similar News
News February 1, 2025
వరంగల్: చంటి బాబుతో వచ్చి సత్తా చాటిన మహిళా కానిస్టేబుల్
కరీంనగర్‌లో జరుగుతున్న మూడో రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వరంగల్ పోలీస్ బృందానికి చెందిన మహిళా కానిస్టేబుల్ రజియా బేగం తన ఏడాదిన్నర కొడుకును ఇంట్లో వదిలిపెట్టి ఉండలేక తనతో పాటు క్రీడా మైదానానికి తీసుకొచ్చింది. ఈరోజు ఉదయం తన బాబు సమక్షంలో జరిగిన డిస్కస్ త్రో ఫైనల్స్‌లో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో అధికారులు, తోటి క్రీడాకారులు ఆమెను అభినందించారు.
News February 1, 2025
వరంగల్ పోలీసులకు పతకాలు
రాష్ట్ర పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీసులు ఆర్చరీలో రికార్డు సృష్టించారు. ఈ క్రీడలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఏకంగా ఐదు పతకాలను సాధించారు. మూడు బంగారు పతకాలతో పాటు ఒక రజతం, ఒక కాంస్యం పతకాన్ని గెలుచుకున్నారు. ఎస్ఐ అనిల్ వేర్వేరు విభాగాల్లో మూడు బంగారు పతకాలు సాధించగా, ఎస్ఐ రాజేందర్, కానిస్టేబుల్ రాహుల్ ఒలింపిక్ విభాగంలో రజతం, కాంస్య పతకాలు సాధించారు.
News February 1, 2025
యువతిని మోసం చేసిన వరంగల్ యువకుడు
వరంగల్ జిల్లా శివనగర్‌కు చెందిన సాయితేజ(26) ప్రేమ పేరుతో ఓ యువతిని(21) మోసం చేశారు. HYD SRనగర్ పోలీసుల ప్రకారం.. సనత్‌నరగ్‌కు చెందిన యువతి బేగంపేటలో పనిచేస్తోంది. సాయితేజ ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె గర్భవతి కావడంతో అబార్షన్ చేయించాడు. చివరికి వేరే అమ్మాయిని చేసుకుంటానని బాధితురాలికి చెప్పి వెళ్లిపోయాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.