News February 18, 2025
నర్సరీల పెంపకం వేగవంతం చేయాలి: కలెక్టర్ త్రిపాఠి

రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు గాను నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండలాల ప్రత్యేక అధికారులు ,ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంసిఓలతో వివిధ అంశాలపై సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయడంలో భాగంగా ముందుగా బ్యాగులలో మట్టి నింపడాన్ని పూర్తిచేయాలని, షెడ్ నెట్లు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News March 13, 2025
నల్గొండలో రేపు మంత్రి కోమటిరెడ్డి పర్యటన

రేపు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 6గంటలకు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం అమనగల్‌కు చేరుకుంటారు. అనంతరం శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన జాతరలో పాల్గొని పార్వతీపరమేశ్వరులకు మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు అమనగల్ నుంచి బయలుదేరి రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు.
News March 13, 2025
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు ధ్రువీకరణ పత్రం

ఎమ్మెల్సీగా ఎన్నికైన నెల్లికంటి సత్యంకు అసెంబ్లీ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గురువారం ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, సీపీఐ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
News March 13, 2025
నలుగురు నల్గొండకు చెందినవారే..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీలుగా ఎంపికైన ఐదుగురిలో విజయశాంతి తప్ప మిగతా నలుగురు నల్గొండ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం.