News October 17, 2024
నర్సాపురం: పున్నమి వెన్నెల్లో.. గోదారి అందాలు

నర్సాపురం పట్టణంలోని వలందర్ రేవులో గురువారం సాయంత్రం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గోదావరి తీరం వద్ద పౌర్ణమి వెన్నెల చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. గోదావరి గట్టున వేట పడవలు కట్టేసి ఉండడం, వెన్నెల వెలుగులు గోదావరి నీటిలో పడి తళ్లుకు మనిపించింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు పరిసర ప్రాంతా ప్రజలు గోదావరి తీరానికి విచ్చేసి సెల్ ఫోన్ల్‌లో బంధించారు.
Similar News
News March 3, 2026
ప.గో జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

జిల్లాలో శబ్ద, వాయు కాలుష్య నియంత్రణపై కలెక్టర్ నాగరాణి భీమవరంలో అధికారులతో సమీక్షించారు. ఉత్సవాలు, ఆలయాలు, ఆసుపత్రుల వద్ద బాణాసంచా కాల్చకుండా రెవెన్యూ, పోలీస్ శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కుటుంబ సర్వే, ఈ-కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News March 2, 2026
భీమవరం: పోలీస్ శాఖ పీజీఆర్ఎస్‌కు 14వ అర్జీలు

భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 14 అర్జీలను స్వీకరించారు. వీటిలో కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ప్రధానంగా అందాయి. అర్జీలపై తక్షణమే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.
News March 2, 2026
కువైట్‌లో పాలకొల్లు యువకుడి మృతి

పాలకొల్లు డామ్ పేటకు చెందిన కందికట్ల రాకేష్ (26) కువైట్ దేశంలో మృతి చెందారు. 8 నెలలు క్రితం కువైట్ వెళ్లిన రాకేష్ కూలి పనులకు వెళ్తుంటాడు. ఆదివారం అనారోగ్యంగా ఉండడంతో స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కువైట్‌లోనే ఉంటున్న రాకేష్ తల్లి రమణకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని స్వస్థలం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తండ్రి శ్రీనివాస్ కోరుతున్నారు.


