News November 25, 2024
నర్సాపూర్(జి)లో 11ఏళ్ల బాలికపై లైంగికదాడికి యత్నం

బాలిక(11)పై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి యత్నించిన ఘటన నర్సాపూర్ (జి)లో ఆదివారం చోటుచేసుకుంది. మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బాలికకు తామర పువ్వులు కోసి ఇస్తామని చెప్పి బసంత చెరువు వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారు. ఆమె అరవడంతో వారు అక్కడ నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI వెల్లడించారు.
Similar News
News February 10, 2026
1000 మందితో ఎన్నికల బందోబస్తు: ADB SP

ఎన్నికల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 1000 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. బందోబస్తులో ముగ్గురు అదనపు ఎస్పీలు, 3 డీఎస్పీలు, 21 మంది సీఐలు, 48 ఎస్ఐలతో, మహిళా సిబ్బంది, హోంగార్డ్స్, రిజర్వు సిబ్బంది, సాయుధ సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలచే బందోబస్తు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 10 వార్డులకు ఒక ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఉంటారని వివరించారు.
News February 10, 2026
200 మంది బైండోవర్.. ఆయుధాలు డిపాజిట్: ADB SP

పోలింగ్ స్టేషన్ల పరిధిలో 163 BNSS అమలులో ఉంటుందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజలు గుమిగూడి ఉండకుండా, గొడవలకు అల్లర్లకు దారి తీయకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 200 మందిని బైండోవర్ చేశామ, 20 మంది నుంచి ఆయుధాలు డిపాజిట్ చేసుకున్నట్లు SP వెల్లడించారు. 86 కేసులు నమోదు చేశామన్నారు. 378లీ మద్యం, రూ.29,90,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
News February 10, 2026
ఆదిలాబాద్: రేపే పోలింగ్.. 216 కేంద్రాలు ఏర్పాటు

ADB మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ బుధవారం జరగనుంది. మొత్తం 49 వార్డులు ఉండగా 69,813 మంది పురుష ఓటర్లు, 73,836 మంది మహిళ ఓటర్లు, ఇతరులు ఆరుగురు ఉన్నారు. పట్టణ పరిధిలో మొత్తం 1,43,655 ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 216 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,154 మంది సిబ్బందిని నియమించారు. 5 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే దివ్యాంగుల కోసం 145 వీల్ ఛైర్స్, 125 ఆటోలను ఏర్పాటు చేశారు.


