News April 12, 2025
నర్సాపూర్(జి): జీవితంపై విరక్తి చెంది సూసైడ్: SI

ఉరేసుకొని వ్యక్తి మరణించిన ఘటన రాంపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై సాయికిరణ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆలకుంట రమేశ్(28) కొన్నేళ్లుగా మద్యానికి బానిసై భార్యతో గొడవపడుతుండేవాడు. భార్య ఆరు నెలల క్రితం తల్లిగారింటికి వెళ్లిపోయింది. శుక్రవారం ఉదయం మద్యం మత్తులో ఇంట్లో ఎవరూ లేని సమయంలో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. అతడి భార్య రుక్మ ఠాణాలో ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేశారు.
Similar News
News November 14, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు..

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శుక్రవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,800గా నిర్ణయించారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ ధరలో ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేటు ధరల్లో సైతం ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.
News November 14, 2025
కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున ఫిర్యాదు మేరకు తాడిపత్రి పట్టణ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఈనెల 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ర్యాలీకి వెళ్తున్న పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్న సందర్భంగా తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దారెడ్డిపై 296, 79, 351(2), 351(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 14, 2025
తగ్గిన బంగారం ధరలు

నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.770 తగ్గి రూ.1,27,850కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.700 పడిపోయి రూ.1,17,200గా నమోదైంది.


