News September 10, 2025
నర్సాపూర్(జీ): నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల కలకలం!

నర్సాపూర్(జీ)కి చెందిన ఓ వ్యక్తి 2018లో విదేశాల్లో మరణించగా.. గ్రామ పంచాయతీ అధికారులు 2019లో అతడు స్థానికంగానే మరణించినట్లుగా తప్పుడు ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు. విదేశాల్లో మృతి చెందిన వారికి విదేశాంగ శాఖ మాత్రమే మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తుంది. గ్రామ పంచాయతీ అధికారులు ఇలా తప్పుడు పత్రం ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Similar News
News September 10, 2025
మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు: VZM SP

మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష, రూ.వెయ్యి జరిమానాను కోర్టు విధించిందని SP వకుల్ జిందాల్ తెలిపారు. 2023లో కొత్తవలసలోని కుమ్మరివీధిలో సూర్యకాంతం ఇంట్లోకి ఎల్.కోట (M) జమ్మాదేవిపేటకు చెందిన కృష్ణ చొరబడి ఆమెను గాయపరిచి బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దీంతో నిందితుడికి శిక్ష ఖరారైంది.
News September 10, 2025
62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది: ఉపరాష్ట్రపతి తల్లి

ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికవడం పట్ల ఆమె తల్లి జానకీ అమ్మాల్ హర్షం వ్యక్తం చేశారు. ‘నాకు కొడుకు పుట్టినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన లాగే నేను కూడా టీచర్‌గా పనిచేశాను. ఆయన పేరునే నా కుమారుడికి పెట్టాను. ఏదో ఒక రోజు తను ప్రెసిడెంట్ అవ్వాలనే ఆ పేరు పెడుతున్నావా అని నా భర్త అడిగారు. 62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని ఆమె వ్యాఖ్యానించారు.
News September 10, 2025
TU: కొనసాగుతున్న M.Ed, L.L.B పరీక్షలు

టీయూ పరిధిలోని M.Ed, LLB పరీక్షలు బుధవారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో జరిగిన M.Ed 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4 బ్యాక్ లాగ్ పరీక్షలకు 37 మందికి 36 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారన్నారు. యూనివర్సిటీలో జరిగిన LLB 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 28 మంది హాజరయ్యారని వెల్లడించారు.