News January 3, 2026
నర్సాపూర్‌లో టెట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

నర్సాపూర్ బీవీఆర్‌ఐటీ కళాశాలలోని టెట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం సందర్శించారు. జిల్లాలో 200 మంది అభ్యర్థులకు గాను 95 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. మొదటి పేపర్‌కు 65 మంది, రెండో పేపర్‌కు 40 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
Similar News
News February 17, 2026
MDK: భార్య ఛైర్‌పర్సన్.. భర్త కౌన్సిలర్!

రామాయంపేట మున్సిపాలిటీలో భార్య భర్తలు మున్సిపాలిటీలో అడుగు పెట్టారు. భార్య గజవాడ లావణ్య ఒకటో వార్డు నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. భర్త నాగరాజు ఏడవ వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొంది మున్సిపాలిటీలో రెండవసారి అడుగుపెట్టారు. భార్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఛైర్ పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భార్య ఛైర్ పర్సన్, భర్త కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు.
News February 17, 2026
పాపన్నపేట: వనదుర్గమ్మకు బోనం సమర్పించిన జోగిని

పాపన్నపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల దుర్గామాత అమ్మవారికి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి జోగిని శ్యామల బోనం సమర్పించారు. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించారు. యేటా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.
News February 16, 2026
పాపన్నపేట: ‘బండ్ల ఊరేగింపులో పాల్గొనడం సంతోషంగా ఉంది’

పాపన్నపేట మండలంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గమాత అమ్మవారికి సోమవారం సాయంత్రం బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొని బండ్ల ఊరేగింపు నిర్వహించిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి బండ్ల ఊరేగింపులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆయా శాఖల అధికారులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


