News September 23, 2025

నర్సాపూర్: అనుమానాస్పద స్థితిలో డ్రైవర్ మృతి

image

శివంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి నర్సింలు(40) అనే డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం నర్సాపూర్‌లో తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 23, 2025

టేక్మాల్: అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత

image

అక్రమంగా యూరియాను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని మెదక్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ కృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి దాడి చేసి వాహనంలో ఉన్న 250 యూరియా సంచులను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

News September 23, 2025

మెదక్: ‘అధిక యూరియాతో పంటలకు తెగుళ్లు’

image

మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల పంటలకు తెగుళ్లు సోకే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ తెలిపారు. సోమవారం నర్సాపూర్‌లోని రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ద యూరియా సరఫరాను ఆయన పరిశీలించారు. అధిక యూరియా వాడకం వల్ల చీడపీడలు పెరిగి, ఖర్చులు పెరిగిపోతాయని, రాబడి తగ్గుతుందని రైతులకు వివరించారు.

News September 22, 2025

మెదక్ ప్రజావాణికి 13 ఫిర్యాదులు

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ అర్జీదారుల నుంచి మొత్తం 13 దరఖాస్తులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.