News March 9, 2025
నర్సాపూర్ (జి): అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

గొల్లమడ గ్రామ శివారులోని నీరటి బుద్దేశ్వర్ వ్యవసాయ భూమికి దగ్గరలోని అడవిలో వేప చెట్టుకు గొల్లమడ గ్రామానికి చెందిన నీరటి గంగాధర్(44) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ భరించలేక ఉరేసుకొని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతని భార్య నీరటి సవిత నర్సాపూర్ జి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా హెడ్ కానిస్టేబుల్ ఎండీ జలాలుద్దీన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Similar News
News July 6, 2025
రాజాపూర్: గొంతులో పూరి ఇరుక్కుని యువకుడి మృతి

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఖానాపూర్‌కు చెందిన బ్యాగరి కిరణ్ కుమార్ (25) వ్యవసాయ పొలంలో పూరీలు తింటుండగా గొంతులో ఇరుక్కొనడం వల్ల ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
News July 6, 2025
వరల్డ్ అథ్లెటిక్స్ నిర్వహణ కోసం పోటీలో భారత్

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌ను నిర్వహించడం కోసం భారత్ బిడ్లు దాఖలు చేయనుంది. 2029, 2031 ఎడిషన్ల కోసం బిడ్లు వేయనున్నట్లు నేషనల్ ఫెడరేషన్ స్పోక్స్ పర్సన్ ఆదిల్ సుమారివాలా వెల్లడించారు. ఏదైనా ఒక ఎడిషన్‌ను నిర్వహించే అవకాశం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామన్నారు. బిడ్ల దాఖలుకు గడువు ఈ ఏడాది OCT1తో ముగియనుంది. హోస్ట్‌ల వివరాలను వరల్డ్ అథ్లెటిక్స్ వచ్చే ఏడాది SEPలో ప్రకటిస్తుంది.
News July 6, 2025
నిజామాబాద్‌లో సందడి చేసిన నటి అనసూయ

నిజామాబాద్ నగరంలో నటి అనసూయ ఆదివారం సందడి చేసింది. హైదరాబాద్ రోడ్డులోని ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. పలు పాటలకు స్టెప్పులు వేసి ఉర్రూతలూగించారు. ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందూరులో తనకు ఇంత మంది అభిమానులు ఉండటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు.