News January 23, 2025
నర్సాపూర్ (జి): బస్సును ఢీ కొట్టిన లారీ

నిర్మల్ నుంచి భైంసా వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సును నసీరాబాద్ గ్రామ శివారులో అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు స్వల్పంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న దిలావర్పూర్‌కు చెందిన నర్సమ్మకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కిషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయికిరణ్ వెల్లడించారు.
Similar News
News March 13, 2025
నితీశ్ రాజీనామా చేసి ఆశ్రమానికి వెళ్లు: తేజస్వీ యాదవ్

బిహార్ సీఎం నితీశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. నితీశ్ రాష్ట్రాన్ని పాలించేందుకు ఫిట్‌గా లేరని దుయ్యబట్టారు. ఆయన ప్రవర్తన సరిగా లేదని, మహిళలను అవమానపరుస్తున్నారని తేజస్వీ ఆరోపించారు. నితీశ్ స్పృహ లేకుండా పాలన చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంటనే పదవికి రాజీనామా చేసి ఆశ్రమానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
News March 13, 2025
సిద్దిపేట: 14 నుంచి 29 వరకు అన్ని బంద్: సీపీ

అనుమతులు లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేపట్టవద్దని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 14 నుంచి 29 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధించినట్లు తెలిపారు. డీజేలు సైతం నిషేధించినట్లు సీపీ తెలిపారు.
News March 13, 2025
ట్యాంక్ పైనుంచి దూకి యువకుడి సూసైడ్

సంజామల మండలం ఎగ్గోనిలో తాగునీటి సరఫరా కోసం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ పైనుంచి దూకి యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా ముద్దనూరు మండలం ఉప్పలూరుకు చెందిన కర్నాటి హర్షవర్ధన్ రెడ్డి(30) ఎగ్గోనిలోని తన సోదరి ఇంటికి 2 రోజుల క్రితం వచ్చాడు. అయితే మద్యానికి బానిసగా మారి, ఆరోగ్యం చెడిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.