News February 14, 2025
నర్సాపూర్ (జి): వ్యక్తిపై హత్య ప్రయత్నం కేసు నమోదు: SI

పాత కక్షలతో ఓ వివాహితను హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటన గురువారం నర్సాపూర్(జి) మండల కేంద్రంలో జరిగింది. స్థానిక ఎస్సై సాయి కిరణ్ వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గడ్డం ఎల్లన్న పాత కక్షలు మనసులో పెట్టుకుని అదే గ్రామానికి చెందిన ఓ వివాహితను ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో పొడిచాడు. వివాహిత భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Similar News
News December 26, 2025
విద్యుత్ కష్టాలకు చెక్.. అయినవిల్లిలో భారీ సబ్‌స్టేషన్!

జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి అయినవిల్లిలో నిర్మిస్తున్న 400 కేవీ సబ్‌స్టేషన్ మైలురాయిగా నిలుస్తుందని కలెక్టర్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. లో-వోల్టేజ్ సమస్యలను అధిగమించి, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టును జిల్లాకే తలమానికంగా చేపడుతున్నట్లు తెలిపారు.
News December 26, 2025
అనంతపురం: మహిళలకు అండగా ‘సఖి’ వాహనం

సమాజంలో హింసకు గురయ్యే మహిళలు సఖి వన్ స్టాప్ సెంటర్‌ను ఆశ్రయించవచ్చని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సఖి వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, బాధితులకు అవసరమైన రక్షణ, సాయం ఇక్కడ అందుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.
News December 26, 2025
పార్వతీపురం: రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన్యం గోబాల సంబరం

జిల్లాలో పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేసి, రైతులకు అదనపు ఆదాయం చేకూర్చడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రభాకర రెడ్డి అన్నారు. శుక్రవారం పార్వతీపురం మండలం ఎం.ఆర్ నగర్‌లో వినూత్న ఆలోచనతో నిర్వహించిన ‘మన్యం గోబాల సంబరం’ కార్యక్రమం ఘనంగా జరిగింది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మెగా పశు వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రారంభించి, శిబిరంలోని ప్రతి విభాగాన్ని నిశితంగా పరిశీలించారు.


