News March 7, 2025

నర్సాపూర్: మాజీ ఎమ్మెల్యే మనవడు మృతి

image

నర్సాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మనవడు నర్సాపూర్ శివారులోని బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు పక్కన గుర్తుతెలియని మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిలుముల నారాయణరెడ్డి డెడ్ బాడీగా గుర్తించారు. మృతదేహాన్ని చిక్‌మద్దూర్‌ గ్రామానికి తరలించారు.

Similar News

News March 7, 2025

మెదక్: నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు: కలెక్టర్

image

ఈ వేసవిలో నీటి సరఫరాలో అంతరాయం లేకుండా, క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్ కలెక్టరేట్ సమావేశ హాలులో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి సమీక్షించారు. తాగునీటి పంపిణీలో సమస్యలు ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలు ద్వారా నీటిని సరఫరా చేసేందుకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించాలని అన్నారు.

News March 7, 2025

మెదక్: విశ్వకర్మ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్‌

image

విశ్వకర్మ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ రాహుల్ రాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పీఎం విశ్వకర్మ పథకంపై అధికారులు, అమలు కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కులవృత్తిదారుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ప్రారంభించిందన్నారు. టైలరింగ్‌, బార్బర్‌, భవన నిర్మాణ వృత్తుల్లో ఉన్నవారికి ఈ పథకం ఫలాలు అందాలన్నారు.

News March 6, 2025

మెదక్: ఇంటర్ విద్యార్థులారా.. ఇది మీ కోసమే..!

image

ఇంటర్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఖాళీ కడుపుతో రాకుండా త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలైన ఇడ్లీ లేదా చద్దన్నం లాంటివి తిని రావాలని మెదక్ జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువగా నీరు తాగుతుండాలన్నారు. పరీక్షలు రాసే సమయంలో ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సెంటర్‌లో అందుబాటులో ఉండే హెల్త్ అసిస్టెంట్‌లను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రతిరోజు కనీసం 8గంటల నిద్ర ఉండాలన్నారు.

error: Content is protected !!