News February 18, 2025

నర్సీపట్నంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్

image

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రెండు రోజుల నుంచి తన స్వగ్రామమైన నర్సీపట్నంలో సందడి చేస్తున్నారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ ఇంటికి తల్లిని చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా నర్సీపట్నం పరిసర గ్రామాలకు చెందిన అభిమానులు ఆయన్ను కలిసి ఫొటోలు తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణ రాజు సోమవారం ఆయనతో భేటీ అయ్యారు.

Similar News

News March 2, 2026

ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా!

image

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 1948-1979 వరకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించిన రెండో ముస్లిం దేశం ఇరానే కావడం విశేషం. ఇరాన్‌కు సైనిక, వ్యవసాయ, టెక్నాలజీ పరంగా హెల్ప్ చేసింది. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ పాలకులు అమెరికా-ఇజ్రాయెల్ ఒక్కటేనని, అది ‘లిటిల్ సైతాన్’ అని విమర్శించారు. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ న్యూక్లియర్ దేశంగా మారడం ఇజ్రాయెల్‌కు ఇష్టం లేదు. అందుకే ఈ గొడవలు.

News March 2, 2026

తిరుమలలో ఘర్షణ.. అసలు నిజం ఇదే!

image

తిరుమల క్యూలైన్‌లో 10గంటల వెయిటింగ్, నీళ్లు ఇవ్వకపోవడంతో భక్తులు తోసుకుని <<19283067>>గొడవ <<>>మొదలైందని కొందరు దుష్ప్రచారం చేశారు. ‘కొంత మంది భక్తుల మధ్య మాటల కారణంగా స్వల్ప ఘర్షణ జరిగింది. వెంటనే శ్రీవారి భక్తులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నీళ్లు ఇవ్వకపోవడం గొడవకు కారణం కాదు. అసత్య వార్తలు వ్యాప్తి చేయడం నేరం. దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం’ అని తిరుపతి జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.

News March 2, 2026

‘సిద్దిపేట సురక్ష నేత్ర’ను ప్రారంభించిన సీపీ

image

ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జిల్లా పోలీస్ విభాగం చేపట్టిన “సిద్దిపేట సురక్ష నేత్ర” సీసీటీవీ వ్యవస్థను సీపీ రష్మీ పెరుమాళ్ ప్రారంభించారు. తొలి దశలో జిల్లావ్యాప్తంగా 200కు పైగా కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. నేరాల నివారణ, వేగవంతమైన విచారణతో పాటు ట్రాఫిక్ పర్యవేక్షణకు ఈ నిఘా నేత్రాలు కీలకంగా మారుతాయని పేర్కొన్నారు.