News March 10, 2025
నర్సీపట్నం: ఇంటర్ పరీక్షల్లో అనుచిత తనిఖీలు

నర్సీపట్నం ఏబీఎం కాలేజీలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో తనిఖీల పేరిట విద్యార్థులతో డ్యూటీ ఆఫీసర్ ప్రసాద్ అనుచిత వైఖరి ప్రదర్శించినట్లు విమర్శలొచ్చాయి. దీంతో అతనిని ఆ విధులు నుంచి తప్పించినట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారిణి సుజాత తెలిపారు. విద్యార్థులు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టామని నేరం రుజువు కావడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
Similar News
News September 18, 2025
అనకాపల్లి: గ్యాస్ సబ్సిడీ నగదు జమ కాని వారికి గమనిక

గ్యాస్ సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాలో జమకాని లబ్ధిదారులు నేరుగా బ్యాంకు వద్దకు వెళ్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ జాహ్నవి లబ్ధిదారులకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దీపం -2 పథకంలో భాగంగా సబ్సిడీపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 805 మంది లబ్ధిదారులకు నగదు జమకాలేదని వారికి డీలర్లు తగిన సమాచారం ఇవ్వాలన్నారు.
News September 18, 2025
ఏలూరు: రెవెన్యూ ఉద్యోగుల బదిలీలు

ఏలూరు జిల్లాలో ఏడుగురు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు బదిలీ ఉత్తర్వులను డీఆర్‌ఓ విశ్వేశ్వరయ్య జారీ చేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మూడు నుంచి ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి ఈ బదిలీలు వర్తిస్తాయని పేర్కొన్నారు.
News September 18, 2025
నిర్మల్: ‘మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలి’

మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ కుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసయ్య అన్నారు. గురువారం పట్టణంలో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మేదరులను ఆదుకునేందుకు మేదరి బంధు, ఇందిరమ్మ ఇళ్లు వెంటనే అందించాలని, జనాభా ప్రాతిపదికన ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రకటించాలన్నారు. 55 సంవత్సరాలు నిండిన వారందరికీ పెన్షన్లను మంజూరు చేయాలని కోరారు.