News March 8, 2025
నర్సీపట్నం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్న కాలనీకి చెందిన పెదిరెడ్ల జగదీశ్ అనే యువకుడు శుక్రవారం అర్ధరాత్రి చెట్టుపల్లి గ్రామం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ ఎస్‌ఐ రాజారావు తెలిపారు.
Similar News
News September 13, 2025
సత్తా చాటిన నల్గొండ పోలీస్

హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో మూడు రోజులపాటు నిర్వహించిన 7వ ఆల్ ఇండియా జైళ్ల శాఖ క్రీడల్లో 24 రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఈ క్రీడల్లో నల్గొండ జిల్లా జైలు పోలీస్ మామిడి చరణ్ 80 కిలోల విభాగంలో కరాటే పోటీల్లో స్వర్ణ పతకం సాధించి తెలంగాణకు గౌరవం తీసుకొచ్చాడు. ఈ విజయంపై జైలు అధికారులు, పోలీసులు శ్రావణ్, గణేష్, సైదులు, రాంబాబు అభినందనలు తెలిపారు.
News September 13, 2025
బెల్లంపల్లి: ఎన్‌కౌంటర్‌లో మావో వెంకటి మృతి

బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన మావోయిస్టు నాయకుడు జాడి వెంకటి ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ అటవీ ప్రాంతంలో గురువారం ఎన్‌కౌంటర్‌లో మరణించారు. 1996లో అజ్ఞాతంలోకి వెళ్లిన వెంకటి, పార్టీలో కీలక పాత్ర పోషించారు. జాడి పోచమ్మ-ఆశయ దంపతులకు ఒక్క కుమారుడు కావడంతో కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది. తహశీల్దార్ కార్యాలయంలో సుంకరిగా పనిచేస్తూ మావో కొరియర్‌గా పనిచేశాడని స్థానికులు తెలిపారు.
News September 13, 2025
గాంధీలో ఉత్తమ సేవలకు సహకారం: జూడాలు

గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.వాణిని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్(జూడా) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆసుపత్రి సేవల మెరుగుదలకు తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే జూనియర్ వైద్యుల సంక్షేమానికి తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో జూడా అధ్యక్షుడు డా.అజయ్‌కుమార్ గౌడ్ సహా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.