News August 21, 2025
నలుగురికి పదేళ్ల జైలు శిక్ష: అనకాపల్లి SP

గంజాయి రవాణాలో నిందితులైన నలుగురికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ చోడవరం జిల్లా కోర్టు జడ్జి హరిహర నారాయణ గురువారం తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. 2015 మార్చి 12న 120 కిలోల గంజాయి రవాణా చేస్తూ జె.రమణ, డీ.మాణిక్యం, జె.నూకరాజు, కె.భూలోక పట్టుబడినట్లు చెప్పారు. వీరిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయగా నేరం రుజువు కావడంతో శిక్ష పడిందని వెల్లడించారు.
Similar News
News August 21, 2025
జగిత్యాల పట్టణ మౌలిక వసతులపై ఎమ్మెల్యే సమీక్ష

జగిత్యాల పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధి పనులపై MLA సంజయ్ కుమార్ తన నివాసంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. CM మంజూరు చేసిన రూ.50 కోట్లు, విలీనం చేసిన ప్రాంతాలకు కేటాయించిన రూ.20 కోట్ల ప్రతిపాదనలపై చర్చించి సూచనలు చేశారు. గంజ్ నాల, ధర్మపురి రోడ్డు, చింతకుంట డ్రైనేజీల నిర్మాణం, పట్టణ పార్కుల్లో క్రీడా స్థలాలు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు అవసరమని, మంజూరైన నిధులు సక్రమంగా వినియోగించాలన్నారు.
News August 21, 2025
‘శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి’

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని అంబేడ్కర్ ఇండియా మిషన్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గంగుమాల శోభన్ బాబు డిమాండ్ చేశారు. ఒక ప్రజా ప్రతినిధి అధికారుల పట్ల రౌడీలా ప్రవర్తించటం మంచిది కాదన్నారు. విధులు నిర్వహించే అధికారులపై తప్పతాగి చేయి చేసుకోవటం గూండాగిరి కాదా అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులే రౌడీల్లా ప్రవర్తిస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందన్నారు.
News August 21, 2025
నల్గొండ: ‘NSS వాలంటీర్లు జాతీయ స్థాయిలో రాణించాలి’

NSS వాలంటీర్లు జాతీయ స్థాయిలో రాణించి MGU ఖ్యాతిని చాటాలని రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి సూచించారు. NLG MGUలో వెస్ట్ జోన్ ప్రి రిపబ్లిక్ పరేడ్-2025 కోసం ఎంజీయూ పరిధిలోని ఉమ్మడి జిల్లాలకు చెందిన NSS వాలంటీర్ల ఎంపికను గురువారం యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ NSS అధికారి నరసింహ, NSS ప్రోగ్రాం అధికారులు వీరస్వామి, సుధాకర్, ఆనంద్, శ్రీనివాస్, కాంతయ్య, దయానంద్ శ్యామల పాల్గొన్నారు.