News April 18, 2024

నలుగురికే అనుమతి: చిత్తూరు SP

image

నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతిస్తామని చిత్తూరు ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు. అభ్యర్థుల పీఎస్వోలను ఆర్వో కార్యాలయంలోకి అనుమతించబోమన్నారు. తుపాకులను వెంట తీసుకు వెళ్లరాదని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ర్యాలీలో టపాసులు కాల్చకూడదని చెప్పారు.

Similar News

News December 16, 2025

AMCల ద్వారా రూ.80 లక్షల ఆదాయం

image

జిల్లా మార్కెటింగ్ శాఖకు AMC ల ద్వారా నవంబరులో రూ.80.03లక్షల ఆదాయం వచ్చినట్లు AD పరమేశ్వరన్ తెలిపారు. పలమనేరు AMC లో రూ.50.58 లక్షలు, చిత్తూరుకు రూ.11.37 లక్షలు, పుంగనూరుకు రూ.7.34 లక్షలు, బంగారుపాళ్యంకు రూ.2.35 లక్షలు, నగరికి రూ.2.16 లక్షలు, కుప్పంకు రూ.4.13 లక్షలు, పెనుమూరుకు రూ.74 వేలు, రొంపిచె ర్లకు రూ.69వేలు, SR పురం రూ.36వేలు, అత్యల్పంగా సోమల AMC ద్వారా రూ.31వేలు వచ్చినట్లు PD తెలిపారు.

News December 16, 2025

పూతలపట్టు: హైవేపై ప్రమాదం.. నుజ్జునుజ్జు అయిన బస్సు

image

పూతలపట్టు మండలం కిచ్చన్న గారి పల్లి సమీపంలో ఆరు లైన్ల జాతీయ రహదారిపై లారీని బస్సు ఢీకొంది. స్థానికుల సమాచారం మేరకు.. సోమవారం రాత్రి ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ప్రయివేట్ బస్సు ఢీకొట్టింది. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు

News December 16, 2025

పుంగనూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం

image

పుంగనూరు మండలంలోని సుగాలి మిట్ట వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఆగి ఉన్న లారీని మరో మినీ లారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడ్డవారు తమిళనాడుకు చెందిన ప్రదీప్, శివ శంకర్, అశోక్‌గా గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించారు.