News October 13, 2025

నల్గొండకు పోటెత్తారు

image

నల్గొండ హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి దర్గా ఉర్సు ఉత్సవాలు ఆదివారం భక్తుల సందడితో మరింత శోభాయమానమయ్యాయి. సెలవు దినం కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా నల్గొండకు పట్టణానికి పోటెత్తారు. దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పరిసరాల్లో ఏర్పాటు చేసిన మేళా దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడాయి. క్లాక్ టవర్ సెంటర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఉత్సవాల వైభవం స్పష్టమైంది.

Similar News

News October 12, 2025

NLG: విదేశీ పర్యటనకు ఉపాధ్యాయులు

image

విదేశాల్లో విద్యా విధానం తెలుసుకునేందుకు ప్రభుత్వం ఉపాధ్యాయులను ఐదు రోజుల పాటు సింగపూర్, జపాన్, వియత్నాం, ఫిన్ లాండ్ పర్యటనకు పంపించనుంది. జిల్లాకు ముగ్గురు, నాలుగు బృందాల్లో 40 మంది చొప్పున 160 మందిని ఎంపిక చేయనున్నారు. కలెక్టర్ ఛైర్మన్‌గా ఏడు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని కమిటీ వీరి ఎంపిక జరపనుంది.

News October 12, 2025

నల్గొండ DCC.. పోటీ పడుతుంది వీరే..!

image

నల్గొండ DCC అధ్యక్ష రేసులో పలువురు పోటీ పడుతున్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, కొండేటి మల్లయ్య, పీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేత, పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్, దైద రవీందర్, రాజా రమేష్ యాదవ్, సామల శ్రీనివాస్‌లు దరఖాస్తు చేసుకున్నారు. ఆశావహుల్లో ముగ్గురిని ఎంపిక చేయనున్నారు. ఆ జాబితాను తొలుత కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్‌కు పంపించనున్నారు.

News October 12, 2025

ఈనెల 14న బంద్: దుడుకు లక్ష్మీనారాయణ

image

బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ ఈనెల 14న బంద్ పాటించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అన్నారు. నల్గొండలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ బంద్‌లో బడుగు బలహీన వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.