News January 15, 2026
నల్గొండలో ఇక నవ శకం!

నల్గొండను నగరపాలక సంస్థగా మార్చడంతో పాలనలో కొత్త శకం ప్రారంభంకానుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నల్లగొండ మునిసిపాలిటీగా కొనసాగగా, ఇకపై కార్పొరేషన్‌గా కొనసాగుతుంది. కార్పొరేషన్ కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు మంజూరవుతాయి. నగర ప్రథమ పౌరుడిగా మేయర్ కొనసాగుతారు. రాజకీయంగా మేయర్ పదవికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. మంత్రులతో సరిసమానమైన ప్రోటోకాల్ ఉంటుంది.
Similar News
News January 21, 2026
KMR: దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తులకు ఆహ్వానం

దివ్యాంగుల ఉపకరణలను పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల తెలిపారు. తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా శారీరక దివ్యాంగులకు, అంధులకు, బదిరీలకు బ్యాటరీ వీల్ చైర్స్, డిగ్రీ విద్యార్థులకు లాప్ టాప్స్ తదితర ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేయుటకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఆన్లైన్ (www.tgobmms.cgg.gov.in) లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News January 21, 2026
‘డ్రంక్ అండ్ డ్రైవ్’ ఉక్కుపాదం: 101 మందికి శిక్షలు!

ప్రమాద రహిత కామారెడ్డి జిల్లాగా మార్చేందుకు ప్రతి రోజూ తనిఖీలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. గత రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 101 మందికి కోర్టు శిక్షలు విధించగా, అందులో 31 మందికి ఒక రోజు జైలు శిక్ష పడింది. మొత్తం రూ. 1,01,000 జరిమానాగా విధించినట్లు ఎస్పీ వెల్లడించారు.
News January 21, 2026
VZM: రబీ లక్ష్యం దాటిన ఉద్యాన మిషన్

జిల్లాలో రబీ సీజన్‌లో ఉద్యాన సాగు లక్ష్యాన్ని మించి పెరిగిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. విజయనగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. లక్ష్యంగా పెట్టుకున్న 4,000 ఎకరాలకు బదులుగా 4,800 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని చెప్పారు. ఖరీఫ్‌లో మరో 6,000 ఎకరాల్లో ఉద్యాన సాగుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.


