News September 1, 2025
నల్గొండలో ఈ ప్రాంతాలు.. అసాంఘిక శక్తులకు అడ్డాలు

NLG జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నాయని స్థానికులు అంటున్నారు. పట్టణంలో 4 రోజుల క్రితం జరిగిన ఓ మర్డర్ ప్రజలను విస్మయానికి గురిచేసింది. పగటిపూట ఎక్కడో ఒకచోట సంచరిస్తూ సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్టాండ్, సర్కారు దవాఖాన, అన్నపూర్ణ క్యాంటీన్లలో తిష్ట వేస్తున్నారని స్థానికులు తెలిపారు. పోలీసులు గస్తీ ముమ్మరం చేసి శాంతి భద్రతలు కాపాడాలని కోరుతున్నారు.
Similar News
News September 2, 2025
గణేష్ నిమజ్జనానికి పటిష్ఠమైన ఏర్పాట్లు: ఎస్పీ

వినాయక నిమజ్జనానికి పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. నల్గొండలోని వల్లభరావు చెరువు వద్ద గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లైటింగ్, బారికేడ్లు, క్రేన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
News September 2, 2025
NLG: విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని HRC ఆదేశం

నల్గొండలోని నలంద ఫార్మసీ కళాశాల యాజమాన్యం తమకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ షమీమ్ అక్తర్, బీ ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులకు వారి టీసీ, ఇతర సర్టిఫికెట్లను వెంటనే అందజేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
News September 2, 2025
అంచనాలు రూపొందించి సమర్పించాలి : కలెక్టర్

ఇటీవల కురిసిన భారీ వర్షాలు వల్ల దెబ్బతిన్న రహదారులకు సంబంధించి అంచనాలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి R&B అధికారులను ఆదేశించారు. సోమవారం CM రేవంత్ రెడ్డి HYD నుంచి వర్షాలు, వరద నష్టాలపై కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇటీవల భారీ వర్షాలకు R&B రహదారులు దెబ్బతిన్నాయని కలెక్టర్ వివరించారు.