News January 5, 2026

నల్గొండలో జిల్లాలో బీసీ వర్సెస్ రెడ్డి

image

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ ఏర్పాటు వ్యవహారం పార్టీలో సెగలు పుట్టిస్తోంది. అధ్యక్షుడిగా పున్నా కైలాస్ నియామకం తర్వాత కమిటీ కూర్పుపై కసరత్తు మొదలవ్వగా.. పదవుల కోసం ఆశావాహులు భారీగా క్యూ కడుతున్నారు. ప్రధానంగా రెడ్డి, బీసీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ‘హస్తం’ రాజకీయాలను వేడెక్కిస్తోంది. సామాజిక సమీకరణల మధ్య సమతూకం పాటించడం అధిష్ఠానానికి కత్తిమీద సాములా మారింది.

Similar News

News January 24, 2026

NLG: ఎన్నికలకు యంత్రాంగం సర్వం సిద్ధం!

image

మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వంసిద్ధమవుతోంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఆ దిశగా అధికారుల సమాయత్తం అవుతున్నారు. జిల్లాలోని NLG కార్పొరేషన్, MLG, HLY, నందికొండ, DVK, CDR, CTL మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి మార్గదర్శకాల పుస్తకాలను మున్సిపల్ సిబ్బంది హైదరాబాద్ నుంచి తీసుకువచ్చారు.

News January 24, 2026

ఏటేటా పడిపోతున్న కూరగాయల సాగు

image

జిల్లాలో కూరగాయ పంటలు, ఆకు కూరల సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతుంది. NLG నగరం మూడువైపులా శరవేగంగా విస్తరిస్తుండడం, వ్యవసాయ భూములు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారిపోతుండడం, మరోవైపు ప్రభుత్వపరంగా ఉద్యాన రైతులకు సహాయ సహకారాలు కొరవడటంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. దశాబ్ద కాలం క్రితం జిల్లాలో వందల ఎకరాలకుపైబడి విస్తీర్ణంలో వివిధ రకాల కూరగాయ పంటలు సాగయ్యేవి. ఇప్పుడు 30 శాతం కూడా సాగు చేయడం లేదు.

News January 24, 2026

NLG: సన్న బియ్యం ధరలకు రెక్కలు

image

నల్గొండ జిల్లాలో సామాన్యులకు సన్నబియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఏటేటా బియ్యం రెట్టింపు అవుతున్నా అధికారులు కట్టడి చేయడం లేదు. గడిచిన నాలుగైదేండ్లుగా ఏటా వానకాలం సీజన్‌లో మిల్లుల వద్ద క్వింటా బియ్యం రూ.3వేల నుంచి రూ.3500 వరకు దొరికేది. ఈ ఏడాది గత పరిస్థితులకు భిన్నంగా వాటి ధరలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం బీపీటీ బియ్యం క్వింటా ధర కొత్తవి రూ.5,500, పాతవి రూ.6,000 పలుకుతున్నాయి.