News August 28, 2025
నల్గొండలో దారుణ హత్య..?

నల్గొండలో ఓ వ్యక్తి మర్డర్ కలకలం రేపుతోంది. స్థానిక దేవరకొండ రోడ్డులో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి బాలుర జూనియర్ కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. ఇవాళ ఉదయం రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడిని చింతికింద రమేష్‌గా గుర్తించారు. రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
Similar News
News August 28, 2025
BREAKING: ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శించారు. హైదారాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం గోలివాడ పంపు హౌజ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా చేరుతున్న వరదను పరిశీలించి మాట్లాడారు.
News August 28, 2025
ఇథనాల్ పెట్రోల్‌తో గడ్కరీ కుమారుడి కంపెనీకి భారీ లాభాలు: కాంగ్రెస్

ఇథనాల్ పెట్రోల్‌తో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుమారుడు నిఖిల్ కంపెనీ భారీగా లబ్ధి పొందుతోందని కేరళ కాంగ్రెస్ ఆరోపించింది. 2024 జూన్ త్రైమాసికానికి ఆయనకు చెందిన CIAN ఆగ్రో ఆదాయం కేవలం రూ.17 కోట్లు ఉంటే ఏడాది కాలంలోనే అది రూ.511 కోట్లకు చేరిందని తెలిపింది. షేర్ విలువ రూ.43 నుంచి రూ.668కి ఎగబాకిందని పేర్కొంది. E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్లు నాశనం అవుతుంటే నిఖిల్ వ్యాపారం విస్తరిస్తోందని తెలిపింది.
News August 28, 2025
వర్షాలపై వరంగల్ పోలీస్ హెచ్చరిక

భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. వర్షాల వల్ల రహదారులు జలమయం కావొచ్చని, అటువంటి సమయంలో నడవడం లేదా వాహనాలు నడపడం ప్రమాదకరమని సూచించింది. తక్కువ లోతు ఉన్న నీటిలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఈ సందేశాన్ని తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేస్తూ, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.