News February 9, 2026

నల్గొండ‌లో రేపే సదస్సు.. మిస్ అవ్వకండి..!

image

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్‌తోపాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. నల్గొండలోని Alimineti Madhava Reddy Police Auditoriumలో FEB 10న సా.6 గంటలకు జరిగే ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు.

Similar News

News February 11, 2026

రేపే నెల్లూరు జిల్లాకు షర్మిల రాక

image

నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటన ఖారారైంది. ఆమె ​ఈనెల 12న ఉదయం 10 గంటలకు మనుబోలు మండలం అక్కంపేటలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడతారు. అదే రోజు సాయంత్రం 4గంటలకు కావలిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యటన వివరాలను డీసీసీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.

News February 11, 2026

3pm రంగారెడ్డి అప్‌డేట్.. దూసుకొచ్చిన ఆమన్‌గల్

image

RR మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 2 తర్వాత ఓటర్లు కేంద్రాలకు కదిలారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 1, 2 మినహా మిగతా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మ.3గం. వరకు జిల్లాలో 68.77% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఆమనగల్లులో 76.33%, చేవెళ్ల 73.04% ఇబ్రహీంపట్నం 68.6%, మొయినాబాద్ 69.79, శంకర్‌పల్లి 65.19, షాద్‌నగర్‌లో 65.25% నమోదైంది. పోలింగ్‌కు మరో 1:10 గం. సమయం మిగిలి ఉంది.

News February 11, 2026

IIT హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

ఐఐటీ హైదరాబాద్ 4 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అటెండెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు(ఫిబ్రవరి 13) తేదీ. పోస్టును బట్టి బీటెక్, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.25K-రూ.35K,ప్రాజెక్ట్ అటెండెంట్‌కు రూ.20K-25K చెల్లిస్తారు. ఫిబ్రవరి 17న రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iith.ac.in