News February 18, 2025
నల్గొండలో రౌడీషీటర్ అరెస్ట్

NLGలోని రాక్ హిల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ రాజేశ్‌ను అరెస్టు చేసినట్లు NLG డీఎస్పీ శివ రాంరెడ్డి సోమవారం తెలిపారు. ఇతనిపై సుమారు 17 హత్యకేసులు ఉన్నట్లు తెలిపారు. పట్టణంతో పాటు ఎల్బీనగర్ ఏరియాను అడ్డాగా చేసుకొని భూసెటిల్మెంట్లు, గంజాయి మత్తులో పలువురికి ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో బాధితుల ఫిర్యాదుతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
Similar News
News November 14, 2025
రాష్ట్రంలో BAM ₹1.1 లక్షల కోట్ల పెట్టుబడి: లోకేశ్

AP: ప్రముఖ బ్రూక్‌ఫీల్డ్ అసెట్స్ మేనేజ్మెంట్(BAM) కంపెనీ రాష్ట్రంలో ₹1.1 లక్షల CR పెట్టుబడి పెట్టనుందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. రెన్యువబుల్ ఎనర్జీ, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజీ, సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో నిధులు వెచ్చించనుందని తెలిపారు. డేటా సెంటర్, రియల్ ఎస్టేట్, GCC, పోర్టులలోనూ పెట్టుబడి పెట్టనుందని ట్వీట్ చేశారు. వీటితో స్థిరమైన పెట్టుబడుల గమ్యస్థానంగా AP మారుతుందని పేర్కొన్నారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్: కాంగ్రెస్ గెలుపు.. కలిసొచ్చింది ఇవే!

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపునకు అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అందులో అతి ముఖ్యమైనవి పరిశీలిస్తే..
1.రేసుగుర్రం నవీన్ యాదవ్‌కు టికెట్ ఇవ్వడం (కలిసొచ్చిన స్థానికత)
2.స్టార్ క్యాంపెయినర్‌గా CM ప్రచారం (ప్రజల్లో చైతన్యం)
3.అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం(మైనార్టీలు INCకి మొగ్గు)
4.MIM మిత్రపక్షం
5.గల్లీల్లో మంత్రుల పర్యటన.. బస్తీల్లో అభివృద్ధి మంత్రం
6.పోలింగ్ మేనేజ్‌మెంట్‌లో సక్సెస్
News November 14, 2025
బీజేపీకి షాక్.. డిపాజిట్ గల్లంతు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ దక్కించుకోలేకపోయారు.


