News August 23, 2025
నల్గొండలో 26న జాబ్ మేళా

నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు పలు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 26న ఉదయం 10:30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ఐటీ క్యాంపస్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి పద్మ తెలిపారు. ఈ మేళాలో ఎంపికైన వారు నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పనిచేయవలసి ఉంటుందని ఆమె చెప్పారు. మరిన్ని వివరాలకు 7893420435, 7095612963 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Similar News
News August 23, 2025
మహిళా పోలీసులకు ఆత్మరక్షణలో శిక్షణ: ఎస్పీ

పోలీసు శాఖలో పురుషులతో సమానంగా విధులు నిర్వర్తించే మహిళా సిబ్బందికి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంపొందించేందుకు ‘SHE leads-NALGONDA believes’ కార్యక్రమం ద్వారా వారం రోజుల పాటు ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ఈ శిక్షణలో నేర పరిశోధన, బ్లూ క్లోట్స్, రాత్రి గస్తీ, బందోబస్తు విధుల్లో వారికి ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడే మెలకువలు నేర్పించామని తెలిపారు.
News August 23, 2025
వారం రోజుల్లో సమర్పించాలి: కలెక్టర్ ఇలా

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హత ఉన్న దరఖాస్తులను గుర్తించి వారం రోజుల్లో సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై శనివారం ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పథకం కింద దారిద్య్ర రేఖ దిగువనున్న ప్రాథమిక ఆదాయం కలిగిన 18 – 59 ఏళ్ల మధ్య వయసున్న కుటుంబ పెద్ద సహజ లేదా ప్రమాదవశాత్తు మరణించిన సమయంలో ఒకేసారి రూ.20 వేలు నగదు సహాయాన్ని కుటుంబానికి అందిస్తామన్నారు.
News August 23, 2025
NLG: ఉత్సవాలను ప్రశాంతతతో జరుపుకోవాలి: ఎస్పీ

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంతతతో, శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపు కోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దం కలిగించే లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతి లేదని శనివారం పేర్కొన్నారు. వివాదాస్పద పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. మండపాల వద్ద మద్యం సేవించరాదని పేర్కొన్నారు.