News April 2, 2024
నల్గొండలో KTR వ్యాఖ్యలపై మీ కామెంట్..

ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ సీట్లు మనవే అని నల్గొండలో నిర్వహించినBRS సన్నాహక సమావేశంలో KTR అన్నారు. ‘నల్గొండ, మిర్యాలగూడ, కోదాడను ఎంతో అభివృద్ధి చేశాం. మూడు మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాం. జిల్లాలో ఫ్లోరోసిస్ రూపుమాపడంతోపాటు సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్లు తెచ్చాం. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోలేకపోయాం. NLG కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండేలున్నారు’ అన్న KTR వ్యాఖ్యలపై మీ కామెంట్..
Similar News
News September 9, 2025
NLG: సులువుగా ఎర.. చిక్కితే విలవిల

నల్గొండ జిల్లాలో రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు పేట్రేగి పోతున్నారు. నిరక్షరాస్యులే కాకుండా ఉన్నత విద్యావంతులు సైతం వీరి ఉచ్చులో పడి మోసపోతున్నారు. ఇటీవల మిర్యాలగూడకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి వీడియో కాల్ చేసి మీపై పోక్సో కేసు ఉందని బెదిరించి రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులను ఆశ్రయించగా అది సైబర్ నేరగాళ్ల పనేనని వారు నిర్ధారించారు.
News September 9, 2025
జిల్లాలో ఎంపిక చేసిన రైతు వేదికలు ఇవే..!

గుడిపల్లి, కుపాశిపల్లి, చందంపేట, బంగారిగడ్డ, జీకేఅన్నారం, <<17654326>>కుర్మేడ్, అప్పాజీపేట, <<>>కొండ్రపోల్, కమలాపూర్, మొలకచర్ల, చెర్యాకుపల్లి, గట్టుప్పల్, భీమారం, ఇప్పాలగూడెం, పెండ్లిపాకల, ధర్మాపురం, మునుగోడు, చందుపట్ల, పాలెం, రామడుగు, దోమలపల్లి, సుంకిశాల, అక్కినేపల్లి, నెమ్మాని, అమ్మనబోలు, నేరేడుగొమ్ము, ముప్పారం, రేగులగడ్డ, పర్వేదుల, SGకొత్తపల్లి, మాదారం, తిరుమలగిరి, పెద్దదేవులపల్లి, రావులపెంట రైతు వేదిక.
News September 9, 2025
NLG: రైతు వేదికలో యూరియా

రైతులకు <<17654369>>యూరియా సరఫరాలో<<>> ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్‌ల వద్ద రద్దీని తగ్గించడానికి, రైతు వేదికల నుంచి యూరియాను విక్రయించనున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 34 రైతు వేదికల్లో ఇప్పటికే నిల్వలు అందుబాటులో ఉంచారు. రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చూడటం, రద్దీని తగ్గించడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం అని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్ తెలిపారు.