News March 15, 2026
నల్గొండ: అలర్ట్.. గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తుల సంచారం

అడవిదేవులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతున్నారని పోలీసులు ఓ ఫొటోను రిలీజ్ చేశారు. బైక్‌పై వచ్చి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చానని చెప్పి, నీళ్లు కావాలని అడిగి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలోని బంగారం లాక్కొని పరారవుతున్నారని చెబుతున్నారు. బయటకు వెళ్లే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తమకు సమాచార ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News April 6, 2026
‘మూస’కు స్వస్తి.. వైవిధ్యం పై సర్కార్ నజర్

జిల్లాలో మూస పద్ధతిలో సాగుతున్న వరి, పత్తి సాగుకు స్వస్తి పలికి, లాభసాటి పంటల వైవిధ్యం వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. ఏటా ఒకే రకమైన పంటలు వేయడం వల్ల భూసారం క్షీణించి దిగుబడులు తగ్గుతున్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్, కూరగాయలు, తోటపని పంటలను ప్రోత్సహించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. కాగా ఇప్పటివరకు 17 ఎకరాలకు పైగానే ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు.
News April 6, 2026
NLG: ఆకాశంలో ఉరుములు.. రైతుల గుండెల్లో గుబులు!

జిల్లాలో వాతావరణ మార్పులు అన్నదాతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట చేతికందే సమయంలో, సాయంత్రం వేళల్లో వినిపిస్తున్న ఉరుముల శబ్దాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే నాన్-ఆయకట్టు గ్రామాల్లో కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని ఆరబోసుకున్న రైతులు భయపడుతున్నారు. నిన్న నిడమనూరు మండలంలో అకాల వర్షంతో చాలా చోట్ల పంటలు నేలకొరిగడంతో పాటు కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది.
News April 6, 2026
నల్లగొండలో సెగలు కక్కుతున్న సూర్యుడు

నల్గొండ జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో, జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల మార్కును దాటి సుర్రుమంటున్నాయి. పెరుగుతున్న ఎండల తీవ్రతకు తోడు ఉక్కపోత తోడవ్వడంతో జనం బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఎండల తీవ్రత మే నెల వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నందున.. జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తోంది.


