News July 26, 2024

నల్గొండ: అస్సాంలో ఆర్మీ జవాన్ మృతి

image

బార్డర్‌‌లో నల్గొండ జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్‌ అసువులు బాశారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. అనుముల మం. మదారిగూడెనికి చెందిన ఈరేటి మహేశ్ (24). సూర్యాపేట ఆర్మీ రిక్రూట్‌మెంట్‌-2022లో సైన్యంలో చేరారు. అస్సాంలోని మంచుకొండల్లో గస్తీ కాస్తుండగా వాతావరణ పరిస్థితుల అనుకూలించక అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స పొందుతూ అక్కడే‌ చనిపోయారు. నేడు భౌతికకాయం స్వగ్రామానికి చేరనుంది.

Similar News

News February 14, 2026

NLG: సేవలో ఆ ఇద్దరు ఉపాధ్యాయులు ఆదర్శం!

image

ఈ గురువులు.. చదువు చెప్పడానికే పరిమితం కాలేదు. విద్యార్థుల భవిష్యత్తుకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. కట్టంగూర్ (M) మల్లారం ప్రాథమిక పాఠశాల HM సమ్మెటి తిరుమలేష్, ఉపాధ్యాయుడు షరీఫ్ తమ సేవాభావంతో స్థానికుల మెప్పు పొందుతున్నారు. కట్టంగూర్ శివారులోని పేలాల పరిశ్రమలో పని చేస్తున్న వలస కార్మికుల పిల్లలను ప్రతి రోజు ఉదయం ద్విచక్రవాహనంపై పాఠశాలకు తీసుకెళ్ళి సాయంత్రం మళ్లీ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తున్నారు.

News February 14, 2026

NLG: మున్సిపల్ ఎన్నికల్లో వాడిపోయిన కమలం

image

ఉమ్మడి NLG జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి నిరాశే మిగిలింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కార్యకర్తలు ఆశించిన విజయం దక్కించుకోలేకపోయారు. యాదాద్రి జిల్లాలో 12 వార్డుల్లో BNG 4, CPL 3, గుట్ట 2, ఆలేరు 2, పోచంపల్లి 1, MLG, DVKలో ఒక్కో వార్డు మాత్రమే, SRPTలో కేవలం 1 సీటు మాత్రమే దక్కించుకున్నారు. మొత్తంగా జిల్లాల వారీగా 15 వార్డులు, NLG కార్పొరేషన్లో 4 డివిజన్లో మాత్రమే దక్కాయి.

News February 14, 2026

మిర్యాలగూడలో ఇదే హయ్యెస్ట్ మెజార్టీ

image

మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 29వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి షేక్ జావిద్ తన సమీప సీపీఎం అభ్యర్థిపై 1,076 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి, మున్సిపాలిటీలోనే అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా నిలిచారు. మరోవైపు, 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులు కేవలం ఒక్క ఓటు తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించి, అత్యల్ప మెజారిటీతో గెలుపొందడం విశేషం.