News February 28, 2026

నల్గొండ: ఆయిల్‌పామ్‌ రైతులకు ‘రాయితీ’ సెగ

image

ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న రైతులకు రాయితీల జాప్యం శాపంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 22 వేల ఎకరాలకు పైగా సాగు జరుగుతుండగా, ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం సకాలంలో అందడం లేదు. ఏటా ఎకరానికి రూ.16,800 చొప్పున నాలుగేళ్ల పాటు ఇవ్వాల్సిన సబ్సిడీ నెలల తరబడి ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు వాపోతున్నారు. పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 28, 2026

VJA: పెట్టుబడి పెట్టి NHAI నుంచి లాభాలు స్వీకరించే అవకాశం

image

కోల్‌కతా- చెన్నై హైవేలో టోల్ గేట్ల ఆపరేషన్‌కై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) ప్రజల నుంచి పెట్టుబడులు ఆహ్వానించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. ఈ హైవేలో విజయవాడ- చిలకలూరిపేట మధ్య 69.4 కి.మీ. మేర టోల్ గేట్ల నిర్వహణలో పబ్లిక్ ఇన్విట్ విధానంలో ప్రజల నుంచి పెట్టుబడులు స్వీకరించి, పెట్టుబడి కంటే పైబడి వచ్చే నగదును లాభం కింద NHAI ప్రజలకు అందిస్తుంది. విధివిధానాలు త్వరలో ఖరారు కానున్నాయి.

News February 28, 2026

కృష్ణా: రేషన్ మాఫియా మాయాజాలం!

image

విజయవాడ సహా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియా రాజకీయ అండతో రెచ్చిపోతోందనే విమర్శలొస్తున్నాయి. పేదల బియ్యంపై ఏకంగా వేలం పాటలు నిర్వహిస్తూ, గెలిచిన వారు ప్రజాప్రతినిధులకు నెలకు రూ.10 నుంచి 15లక్షల వరకు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాము అనే వ్యక్తి సిండికేట్‌గా మారి రేషన్ విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. పేదల పొట్ట కొట్టి ఇలా వ్యాపారం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News February 28, 2026

గద్వాల్: అదృశ్యమైన యువకుడి సూసైడ్..!

image

గద్వాల మండలం గుంటుపల్లికి చెందిన బొల్లెద్దుల రోహిత్ (24) ఇటీవల అదృశ్యం కాగా అతడి తండ్రి బొల్లెద్దుల జానీ తన కుమారుడు కనిపించడం లేదని ఈనెల 25న గద్వాల పీఎస్‌లో కంప్లైంట్ చేశాడు. అయితే రోహిత్ ప్రేమించిన అమ్మాయి తరఫు బంధువుల వేధింపు వల్ల సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై రోహిత్ తండ్రి జానీ శనివారం హైదరాబాద్ నాచారం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.